2025
యాజకత్వపు అధికారం మరియు శక్తి ద్వారా ఆశీర్వదించబడ్డారు
2025 సెప్టెంబరు


“యాజకత్వపు అధికారం మరియు శక్తి ద్వారా ఆశీర్వదించబడ్డారు,” లియహోనా, 2025 సెప్టెంబరు.

లియహోనా నెలవారీ సందేశము, 2025 సెప్టెంబరు

యాజకత్వపు అధికారం మరియు శక్తి ద్వారా ఆశీర్వదించబడ్డారు

సంఘ సభ్యులు సంఘములో, ఇంట్లో మరియు ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు సేవ చేయడానికి మరియు ఆశీర్వదించడానికి దేవుని శక్తిని ఉపయోగిస్తారు.

ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్

దేవుని రక్షణ మరియు ఉన్నతస్థితి కార్యాన్ని నెరవేర్చడంలో ఆయన పరిశుద్ధ యాజకత్వం ఆవశ్యకమని, ఆ ఉద్దేశ్యం కోసమే ఆయన భూమిపై యాజకత్వాన్ని పునఃస్థాపించారని మరియు అది యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘముచే నిర్వహించబడుతుంది అనేది ప్రపంచానికి మన సాక్ష్యం.

యాజకత్వ అధికారం మరియు శక్తి యొక్క ఆవశ్యకత

యేసు క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నారు. ఆయన భూమిపై జీవించిన యుగములో వలె, ఈ చివరి సువార్త యుగములో మానవాళిని విమోచించే ముఖ్యమైన పనిని నెరవేర్చడానికి ఆయన సృష్టించిన సాధనమే సంఘం. సంఘము ద్వారా:

  • ఆయన తన సువార్తను ప్రపంచవ్యాప్తంగా ప్రకటించగలరు.

  • ఆయన బాప్తిస్మమును మరియు అన్ని ఇతర నిబంధనలను అందించగలరు—ఆయన సిలెస్టియల్ రాజ్యమునకు ఒక నిబంధన మార్గాన్ని కూడా అందించగలరు.

  • ఆయన కుటుంబాలను నిత్యత్వము వరకు ఏకం చేయగలరు.

  • ఆయన రక్షణ వరాలను అందించగలరు, అవి లేకుండా మరణించిన వారికి కూడా.

  • ఆయన వర్తమానంలో దేవుని పిల్లల శారీరక అవసరాలకు పరిచర్య చేయుగలరు.

ఈ గొప్ప ఉద్దేశాలను నెరవేర్చడానికి మరియు రక్షకుని రాక కోసం సిద్ధ పడడానికి, సంఘానికి దేవుని యొక్క నిరంతర దిశానిర్దేశం, అధికారం మరియు శక్తి అవసరం. సంఘము “జీవము గల సత్య సంఘము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 1:30) ఎందుకంటే, క్రీస్తు తన యాజకత్వం ద్వారా, అంటే, “దేవుని కుమారుని క్రమముననుసరించిన పరిశుద్ధ యాజకత్వము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:3) ద్వారా, తన నాయకత్వాన్ని మరియు శక్తిని సంఘానికి ప్రసాదిస్తారు.

కానీ ఈ పవిత్ర యాజకత్వం లేకపోతే, సంఘం వాస్తవంగా ఒక లౌకిక సంస్థగా ఉండేది, ప్రపంచంలో మంచి పనులు చేస్తుంది కానీ, దేవుని కుమారులు మరియు కుమార్తెలను ఆయన సన్నిధిలో నిత్యజీవ ఆనందం కోసం సిద్ధం చేసే అంతిమ ప్రయోజనాన్ని సాధించడానికి శక్తి లేకుండా ఉండేది. ఈ యాజకత్వంతో, మరియు ఈ యాజకత్వ పనిని నిర్దేశించే తాళపుచెవులతో, సంఘములో అధికారం మరియు క్రమం రెండూ ఉన్నాయి.

“సంఘములో, యాజకత్వ అధికారము మొత్తము యాజకత్వ తాళపుచెవులను కలిగియున్న వారి మార్గదర్శకత్వం క్రింద వినియోగించబడుతుంది.

“యాజకత్వం అనుగ్రహించబడుట మరియు యాజకత్వ స్థానాలకు నియమించబడుట ద్వారా సంఘము యొక్క యోగ్యులైన పురుష సభ్యులు యాజకత్వ అధికారాన్ని పొందుతారు. దేవుని యోక్క పనిని నెరవేర్చడంలో సహాయపడటానికి ప్రత్యేక పరచబడినందున లేదా నియమించబడినందున, సంఘ సభ్యులందరూ అప్పగించబడిన అధికారాన్ని ఉపయోగించగలరు.”

యాజకత్వ తాళపుచెవుల ద్వారా, ప్రభువు యొక్క ప్రాధాన్యతలు ఎల్లప్పుడూ ప్రబలంగా ఉంటాయి. ఆయన నిర్దేశానికి అనుగుణంగా లేని వ్యక్తిగత ఉద్దేశ్యాలను ఎవరూ ఆమోదించలేరు. వ్యక్తిగత లాభం మరియు వ్యక్తిగత అనుచరులను కోరుతూ, యాజకవంచనలో ఎవరూ విజయం సాధించలేరు.

సంఘ సభ్యుల గృహాలలో కూడా యాజకత్వము కీలక పాత్ర పోషిస్తుంది. “ఆ పనికి యాజకత్వపు తాళపుచేతులు కలిగియున్న వ్యక్తి ఆదేశాల మేరకు మాత్రమే యాజకత్వ అధికారాన్ని ఉపయోగించవచ్చనే సూత్రం సంఘములో ప్రాథమికమైనది, అయితే ఇది కుటుంబంలో వర్తించదు.” అని అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్, ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారులు, బోధించారు. తండ్రులు ప్రేమ మరియు నీతితో వారి కుటుంబములపై అధ్యక్షత్వం వహించాలి—సలహా ఇవ్వడం, కుటుంబ సమావేశాలు నిర్వహించడం, కుటుంబ సభ్యులకు లేదా ఇతరులకు యాజకత్వం లేదా స్వస్థపరిచే ఆశీర్వాదాలు ఇవ్వడం మొదలైనవి—యాజకత్వ తాళపుచెవులు కలిగి ఉన్నవారి దిశానిర్దేశం లేదా అధికారిక అనుమతి లేకుండానే.

“తండ్రి లేనప్పుడు మరియు తల్లి కుటుంబ నాయకురాలిగా ఉన్నప్పుడు అదే సూత్రం వర్తిస్తుంది. ఆమె తన ఇంటిలో అధ్యక్షత వహిస్తుంది మరియు దేవాలయంలో తన వరము మరియు ముద్రణ ద్వారా యాజకత్వం యొక్క శక్తి మరియు ఆశీర్వాదాలను తన కుటుంబంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తుంది.”

మన కాలంలో యాజకత్వ పునఃస్థాపన

15 మే, 1829

జోసెఫ్ స్మిత్ జూనియర్ మరియు ఆలీవర్ కౌడరీకి అహరోను యాజకత్వాన్ని పునఃస్థాపిస్తున్న బాప్తిస్మమిచ్చు యోహాను

ఈ చివరి యుగంలో యాజకత్వ అధికారం పునఃస్థాపన క్రమబద్ధమైన, దశలవారీ పురోగతిలో కొనసాగింది. మన యుగానికి పునాది లేఖనమైన మోర్మన్ గ్రంథం 1829లో అనువదించబడుతున్నప్పుడు, ప్రభువు తన యాజకత్వ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించారు. బాప్తిస్మము గురించి జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీ యొక్క ప్రార్థనాపూర్వక విచారణకు ప్రతిస్పందనగా, పునరుత్థానుడైన బాప్తిస్మమిచ్చు యోహాను కనిపించి, వారికి అహరోను యాజకత్వాన్ని ప్రసాదించాడు, ఈ యాజకత్వం “దేవదూతల పరిచర్య యొక్కయు, పశ్చాత్తాప సువార్త యొక్కయు, పాపక్షమాపణ కొరకు ముంచుట ద్వారా బాప్తిస్మము యొక్కయు తాళపుచెవులను కలిగియున్నది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 13:1). ఆ అధికారంతో, జోసెఫ్ మరియు ఆలివర్ ఒకరికొకరు బాప్తిస్మం ఇచుకున్నారు మరియు తరువాత సంఘం అధికారికంగా వ్యవస్థీకరించబడినప్పుడు ఇతరులకు బాప్తిస్మం ఇచ్చారు.

మే 15, 1829 తర్వాత వెంటనే

మెల్కీసెదకు యాజకత్వము యొక్క పునఃస్థాపన

బాప్తిస్మమిచ్చు యోహాను ప్రత్యక్షమైన కొద్దికాలానికే, ప్రాచీన అపొస్తలులైన పేతురు, యాకోబు, యోహానులు ప్రత్యక్షమై, “రాజ్యపు తాళపుచెవులను, మరియు కాలముల సంపూర్ణత కొరకు సువార్త యుగముతో” సహా ఉన్నతమైన, లేదా మెల్కీసెదెకు యాజకత్వాన్ని ప్రసాదించారు. ( సిద్ధాంతం మరియు నిబంధనలు 27: 13; 128:20 కూడా చూడండి).

3 ఏప్రిల్, 1836

కర్ట్‌లాండ్ దేవాలయంలోని వేదికలు

కర్ట్‌లాండ్ దేవాలయంలో, ముగ్గురు పురాతన ప్రవక్తలు, మోషే, ఎలియాసు మరియు ఏలీయా, జోసెఫ్ మరియు ఆలివర్‌లకు కనిపించి, ఇశ్రాయేలీయులను పోగుచేయుటకు మరియు ప్రభువు దేవాలయాలకు సంబంధించిన పని యొక్క తాళపుచెవులను వారికి అప్పగించినప్పుడు, అదనపు అవసరమైన యాజకత్వ అధికారం వచ్చింది (సిద్ధాంతం మరియు నిబంధనలు 110:11–16 చూడండి).

వేసవి 1829–ఏప్రిల్ 1835

జోసెఫ్ స్మిత్ జూనియర్ కొత్త పిలుపులలో సభ్యులను ఆమోదించుటకు ప్రారంభ పరిశుద్ధులకు పిలుపునిచ్చాడు

సిద్ధాంతం మరియు నిబంధనలలో ఇప్పుడు లేఖనములుగా ముద్రించబడిన ప్రకటనలు, ఉన్నత (మెల్కీసెదెకు) మరియు సన్నాహక (అహరోను) యాజకత్వాల కార్యాలయాలకు పురుషులను నియమించడం; బిషప్పు‌ల వంటి యాజకత్వ అధికారులను నియమించడం; మరియు యాజకత్వ సమూహము‌లు మరియు సలహాసభ‌ల ఏర్పాటు గురించి ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు సూచించాయి.

1835–1973

మైదానాలను దాటుతున్న మార్గదర్శకులు

ప్రవచనాత్మక దిశానిర్దేశం సంఘములో యాజకత్వ సంస్థ మరియు యాజకత్వ పనితీరును మార్గనిర్దేశం చేస్తూనే ఉంది. ఉదాహరణకు, కర్ట్‌లాండ్ యుగంలో పన్నెండుమంది సమూహమునకు సహాయం చేయడానికి డెబ్బదిమంది సమూహము ఏర్పాటు చేయబడింది. పశ్చిమ దేశాలకు గొప్ప వలసలు మరియు విస్తృత భౌగోళిక ప్రాంతాలలోకి సంఘ సభ్యులు చెదరగొట్టబడిన తరువాత, ఈ సమూహాలు సంఘము యొక్క స్టేకులలో పనిచేయడానికి నియమించబడ్డాయి.

1973–ప్రస్తుతం

సర్వసభ్య సమావేశములో పాడుతున్న గాయక బృందం

అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ (1895–1985), ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ (1899–1994), మరియు గార్డన్ బి. హింక్లి (1910–2008) నిర్వహణలో, డెబ్బది మరియు వారి సమూహము ప్రధాన సంఘ స్థాయిలో మరియు సంఘ ప్రాంతాలలో పన్నెండుమంది సమూహము కింద నేరుగా పనిచేయడం ప్రారంభించాయి. ఆ తర్వాత స్టేకు స్థాయిలో సమూహములు నిలిపివేయబడ్డాయి. నేడు, పన్నెండు సమూహాల ప్రధాన అధికారులు మరియు ప్రాంతీయ డెబ్బదులు, అపొస్తలులకు “సంఘమును నిర్మించుటలో, మరియు సమస్త జనములలో దాని వ్యవహారములను నియంత్రించుటలో” (సిద్ధాంతం మరియు నిబంధనలు 107:34) సహాయపడుతున్నాయి. సంఘం విస్తరిస్తున్న కొద్దీ అదనపు డెబ్బది సమూహములను సృష్టించవచ్చు.

గాంబియాలోని సంఘ సభ్యులను పలకరిస్తున్న ఎల్డర్ క్రిస్టాఫర్‌సన్

ఫిబ్రవరి 2022లో పశ్చిమ ఆఫ్రికాలోని గాంబియాలో సోదరులు సాంప్సన్ మరియు డేనియల్ అమకోలను పలకరిస్తున్న ఎల్డర్ క్రిస్టాఫర్‌సన్.

యాజకత్వం: దీవించే శక్తి

ఒక్క మాటలో చెప్పాలంటే, యేసు క్రీస్తు పునఃస్థాపించిన యాజకత్వ అధికారం మరియు శక్తి యొక్క ఉద్దేశ్యం దీవించడం. సంఘ సభ్యులు సంఘములో, గృహములో మరియు ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు సేవ చేయడానికి మరియు ఆశీర్వదించడానికి దేవుని శక్తిని ఉపయోగించడానికి ఇది వీలు కల్పిస్తుంది. దేవుని రాజ్యం పెరిగి భూమిని నింపుటకు సహాయపడటానికి వారి స్వంతదానికంటే చాలా ఎక్కువైన దైవిక బహుమతులు మరియు శక్తిని ఉపయోగించి, సభ్యులు రక్షకుని యొక్క రక్షణ మరియు ఉన్నతస్థితి కార్యమును సాధించడంలో చేరుతారు.(సిద్ధాంతం మరియు నిబంధనలు 65:2, 5–6 చూడండి).

ప్రభువు ఇలా వివరించారు, “ఈ ఉన్నత యాజకత్వము[మెల్కీసెదెకు] సువార్తను నిర్వహించి, పరలోకరాజ్య మర్మముల తాళపుచెవులను అనగా దేవుని జ్ఞానము యొక్క తాళపుచెవిని కలిగియుండును.

“ఆ విధులలో, దైవత్వము యొక్క శక్తి ప్రత్యక్షపరచబడుతుంది.

దాని విధులు, యాజకత్వపు అధికారము లేకుండా శరీరమందు మనుష్యునికి దైవత్వపు శక్తి ప్రత్యక్షపరచబడదు” (సిద్ధాంతం మరియు నిబంధనలు 84:19–21).

నిస్సందేహంగా, విధులు అనేవి యాజకత్వం ద్వారా నిర్వహించబడే వేడుకలు లేదా సంస్కారాలు, వీటి ద్వారా మనం దేవునితో నిబంధనలు చేస్తాము, బాప్తిస్మము నుండి ప్రారంభమై ప్రభువు మందిరములో స్వీకరించే నిబంధనల వరకు కొనసాగుతుంది. ఈ నిబంధనలను పాటించడం ద్వారానే మనం క్రీస్తు ప్రాయశ్చిత్త కృప ద్వారా “ప్రకృతి సంబంధియైన” పురుషులు మరియు స్త్రీల నుండి పరిశుద్ధులుగా (మోషైయ 3:19 చూడండి) మార్చబడతాము మరియు దేవుని ముందు నీతిమంతులుగా మరియు శుద్ధిచేయబడువారుగా—నిర్దోషులుగా మరియు నిష్కళంకులుగా—మారతాము (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:29–31; 3 నీఫై 27:16–20 చూడండి).

ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సలహాసభ ద్వారా రాయబడిన “యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన: ప్రపంచానికి ద్విశతాబ్ది ప్రకటన” నుండి ఈ ఉల్లేఖనం తగిన సారాంశాన్ని వ్యక్తపరుస్తుంది:

“1830 ఏప్రిల్ 6న ఏర్పాటు చేయబడిన యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము, క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన క్రొత్త నిబంధన సంఘమని మేము ప్రకటిస్తున్నాము. ఈ సంఘము దాని ప్రధాన మూలరాయియైన యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణ జీవితముతో, ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తము మరియు యధార్థమైన పునరుత్థానముతో అనుసంధానించబడినది. యేసు క్రీస్తు మరొకసారి అపొస్తలులను పిలిచి, వారికి యాజకత్వ అధికారమును అనుగ్రహించెను. ఆయన మనందరినీ తన యొద్దకు, ఆయన సంఘము యొద్దకు రమ్మని, పరిశుద్ధాత్మను, రక్షణ విధులను, శాశ్వతమైన ఆనందమును పొందమని ఆహ్వానించుచున్నారు.