2024
పరిశుద్ధ యాజకత్వము యొక్క వస్త్రము
2024 సెప్టెంబరు


“పరిశుద్ధ యాజకత్వము యొక్క వస్త్రము,” లియహోనా, 2024, సెప్టె.

లియహోనా నెలవారీ సందేశము, 2024 సెప్టెంబరు

పరిశుద్ధ యాజకత్వము యొక్క వస్త్రము

దేవాలయ వరములో భాగముగా, మనము పరిశుద్ధ యాజకత్వము యొక్క వస్త్రమును ధరించడానికి అధికారమివ్వబడ్డాము—స్వయంగా రక్షకుని యొక్క చిహ్నము.

కలిసి నడుస్తున్న ఆదాము, హవ్వలు

డగ్లస్ ఎమ్. ఫ్రైయర్ చేత ఆదాము మరియు హవ్వ, నుండి వివరణ

నిస్సందేహంగా వారికి ఇవ్వబడిన సిద్ధపాటు మరియు గుర్తుంచుకోవడానికి వారు ప్రయత్నించిన హామీలతో సంబంధం లేకుండా, వారి దివ్యమైన ఏదేను వనమును విడిచిపెట్టి పడిపోయిన లోకములోనికి అడుగు పెట్టడం ఆదాము, హవ్వలకు ఆకస్మిక దిగ్భ్రాంతిని కలిగించియుండవచ్చు.

గంభీరమైన అవగాహనతో, వారు తమ ప్రశాంతమైన, చింతలేని జీవితాన్ని వ్యతిరేకత, చెమట, ముళ్ళు మరియు దుఃఖంతో కూడిన ప్రపంచంతో మార్చడం—తరువాత కలిగే మరణమని పిలవబడిన దాని అర్ధమేమిటో వారు గ్రహించారు. వీటన్నింటికీ అర్థమేమిటో మొదట్లో వారికి తెలియదు, కానీ ప్రతి రోజు క్రొత్త బాధను తీసుకొనిరాగలదని వారు త్వరలోనే తెలుసుకున్నారు. వాస్తవానికి, అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, వారు తమ పరలోకమందున్న తండ్రి నుండి వేరు చేయబడి—మోషే తరువాత వ్రాసినట్లుగా, “ఆయన సన్నిధి నుండి వేరుచేయబడి” వాటన్నిటినీ ఎదుర్కొంటారని గ్రహించడం.

చల్లని, దుర్భరమైన ప్రపంచంలో, ఈ వేర్పాటు మరియు ఒంటరితనము కారణంగా, ఆదాము, హవ్వలు, ఈ ఒక విషయాన్ని గుర్తుంచుకోవడం ఎంత ఓదార్పునిస్తుంది: వాగ్దానము చేయబడినవి—అవి పరిశుద్ధమైనది మరియు నిత్యమైనవి నిబంధనలని పిలవబడతాయి. వారి జీవితకాల దినములన్నీ తండ్రికి విధేయులవుతామని వారు వాగ్దానము చేసారు, మరియు ఆయన ఒక రక్షకుని ఇవ్వడానికి వాగ్దానము చేసారు, ఆయన వారి బాధను, విచారమును తగ్గించి, వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేస్తారు, మరియు ఆయన సన్నిధిలోనికి వారిని క్షేమంగా తీసుకొస్తారు.

కానీ ఈ మర్త్యులు తాము వాగ్దానము చేసిన దానిని ఎలా గుర్తుంచుకుంటారు? వారు తమ ప్రమాదకరమైన పరిస్థితిని—రాత్రి, పగలు, అన్ని సమయాలలో ఎలా తెలుసుకుంటారు?

వారి నిబంధనల యొక్క జ్ఞాపకార్ధము

అటువంటి జ్ఞాపకార్ధము కోసం ఆయన వారికి “చర్మపు చొక్కాయిలను” ఇచ్చారు. అది గొప్ప బహుమానము మరియు సమయానుకూలమైనది. నిషేధించబడిన ఫలము తినిన తరువాత, ఆదాము, హవ్వలు దాదాపు వెంటనే తాము నగ్నంగా ఉన్నామని తెలుసుకున్నారు. మొదట, వారు అంజూరపు ఆకులతో వారి నగ్నత్వాన్ని కప్పుకోవాలని ప్రయత్నించారు. తరువాత, సరిపోదని భయపడి, వారు ప్రభువు నుండి దాక్కోవడానికి ప్రయత్నించారు. (అటువంటి అనాలోచిత ప్రయత్నము మర్త్యత్వము స్థిరపడటానికి నిదర్శనము!) ఆ క్షణము నుండి ప్రస్తుతం వరకు, ప్రేమగల తండ్రి దాగుకొనుట నుండి రమ్మని, ఆయన వద్దకు రమ్మని తన పిల్లలను ఆహ్వానించారు. అప్పటి నుండి చర్మపు చొక్కాయిల వలె, వివిధ రకాల దుస్తులతో, ఆయన తన దయతో మనల్ని నగ్నంగా విడిచిపెట్టలేదు కానీ మన వాగ్దానాలు మరియు ఒడంబడికలను గుర్తు చేసే “నీతి అను పైబట్టను” విధేయులకు ధరింప చేసారు. ఈ “రక్షణ వస్త్రములు” అన్నిటికంటె గొప్ప బహుమానము, యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తముకు చిహ్నముగా ఉన్నాయి.

వస్త్రము రక్షకునికి చిహ్నముగా ఉన్నది.

సరే, ఆదాము, హవ్వ , నిబంధనలు మరియు దుస్తులు గురించి ఈ ఆలోచన బహుశా, మానసిక వ్యాయామం కంటే ఎక్కువైనది కావచ్చు. ఆదాము, హవ్వలు ఎలా భావించారో కష్టమైనది కాదు, ఎందుకనగా మనం కూడా ఈ పడిపోయిన లోకంలో కష్టాలను ఎదుర్కొంటాము. మనం కూడా దేవుని సన్నిధి నుండి వేరు చేయబడతాము, మరియు మనం పాపము చేసిన ప్రతిసారి మనల్ని మనం దూరపరచుకుంటాము. ఆదాము, హవ్వల వలే, మనము ఆల్ఫా, ఒమేగా ఐన అదే రక్షకుడు మరియు జీవముగల దేవుని కుమారుడు, నజరేయుడైన యేసు క్రీస్తును ఇవ్వబడ్డాము. ఆదాము, హవ్వ వలే, మనము దేవునితో నిబంధనలను చేసాము. దేవాలయ వరములో భాగముగా, మనము ఆ నిబంధనల యొక్క పరిశుద్ధమైన శారీరక జ్ఞాపకార్ధము ఇవ్వబడ్డాము—స్వయంగా రక్షకుని యొక్క చిహ్నము. మన యుగములో అది పరిశుద్ధ యాజకత్వము యొక్క వస్త్రము అని పిలువబడింది.

యేసు క్రీస్తు యొక్క చిత్రపటం

హారీ ఆండర్సన్ చేత, రెండవ రాకడ నుండి వివరణ

మనము ఈ వస్త్రమును మన బయట దుస్తుల క్రింద ధరిస్తాము. నాకు ఎటువంటి బాధ్యతలు ఉన్నప్పటికినీ, నేను జీవితంలో ఎటువంటి బాధ్యతలను వహించినప్పటికినీ, అనుదిన జీవితానికి అవసరమైన బాధ్యతలు ఏవైనప్పటికినీ, వాటన్నింటితో పాటు నా నిబంధనలు ఉంటాయి—నిరంతరము మరియు శాశ్వతంగా. వీటన్నింటి క్రింద నేను నిర్విరామంగా పట్టుకొని ఉన్న పవిత్ర వాగ్దానాలు ఉన్నాయి. వస్త్రము మెరుస్తూ ఉండదు లేదా లోకం యెదుట ఆడంబరంగా ప్రదర్శించబడదు, లేదా నా నిబంధనలు అలా ఉండవు. కానీ వాటిని నాకు దగ్గరగా—నాకు సాధ్యమైనంత దగ్గరగా ఉంచుతాను. అవి చాలా వ్యక్తిగతమైనవి మరియు అత్యంత పరిశుద్ధమైనవి.

ఆ నిబంధనలు జ్ఞాపకముంచుకొనుటలో, ఆ రెండు-విధాల వాగ్దానాలలో, మనం మన జీవితకాలములంతటా వస్త్రమును ధరిస్తాము. ఈ ఆచరణ మన జీవితాలలో స్థిరమైన ప్రభావంగా రక్షకుడు ఉండటానికి మన కోరికను ప్రతిఫలిస్తుంది. ఇతర ప్రియమైన చిహ్నాలు కాలానుగుణంగా ఉంటాయి. మనం మన జీవితాలలో ఒకసారి బాప్తీస్మం పొందాము. మనం వారానికి ఒకసారి సంస్కారము తీసుకుంటాము. పరిస్థితులు అనుమతించినట్లుగా మనం దేవాలయానికి హాజరవుతాము. కాని పరిశుద్ధ యాజకత్వము యొక్క వస్త్రము ప్రత్యేకమైనది: ఈ చిహ్నమును మనము ప్రతిరోజు మరియు రాత్రి గౌరవిస్తాము.

మరియు నిబంధనలు ఆవిధంగా ఉన్నాయి—సౌలభ్యం లేదా అజాగ్రత్తతో పక్కన పెట్టబడదు మరియు సమాజంలోని రీతులు మరియు వైఖరులకు సరిపోయేలా సవరించబడలేదు. యేసు క్రీస్తు యొక్క శిష్యుల జీవితంలో, లోకము యొక్క విధానాలు మన నిబంధనలతో విలీనం చేయబడేలా మార్చబడాలి, కాని మరొకవిధంగా కాదు.

మనము వస్త్రము ధరించినప్పుడు, ప్రథమ అధ్యక్షత్వము బోధించినట్లుగా, మనము యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ చిహ్నమును ధరిస్తున్నాము. ఆ సంగతి అలా ఉండగా, ఆ చిహ్నాన్ని తీసివేయడానికి మనం ఎప్పుడూ ఒక సాకును వెదకరాదు. వస్త్రం ప్రాతినిధ్యం వహించే అధికారం, భద్రత, మరియు దయ యొక్క వాగ్దానాన్ని మనం ఎందుకు కోల్పోతాము? దీనికి వ్యతిరేకంగా, మనం వస్త్రాన్ని తాత్కాలికంగా తీసివేయవలసి వచ్చినప్పుడల్లా, వీలైనంత త్వరగా దానిని తిరిగి ధరించడానికి మనం ఆసక్తిగా ఉండాలి, ఎందుకంటే మన నిబంధనలకు ఉద్దేశాన్నిచ్చే వాగ్దానాలు మరియు ప్రమాదాలు రెండింటినీ మనం గుర్తుంచుకుంటాము. అన్నిటికిపైగా, మనము క్రీస్తు యొక్క సిలువను మరియు ఖాళీ సమాధిని గుర్తుంచుకుంటాము.

కొందరిలా చెప్పవచ్చు, “యేసును గుర్తుంచుకోవడానికి నాకు ఇతర విధానాలున్నాయి.” అది అద్భుతమైనది, అని నేను జవాబిస్తాను. ఎంత ఎక్కువైతే అంత మంచిది. “ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకముంచుకోవడానికి,” మన ఒడంబడికను మనము నిలుపుకోవడానికి వీలైనన్ని మార్గాలను మనం ఆలోచిద్దాం. కానీ ఆవిధంగా చేయడంలో, పరిశుద్ధ యాజకత్వము యొక్క వస్త్రము వరము పొందిన వారికి ప్రభువు స్వయంగా ఇచ్చిన జ్ఢాపకార్ధమును ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించడం నిజాయితీలేనిది.

యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త నాకు చాలా ముఖ్యమైనది. నా నిత్య నిరీక్షణలు మరియు ఆకాంక్షలు, నేను ప్రియముగా ఎంచే సమస్తము, ఆయనపై ఆధారపడియున్నవి. ఆయన “నా రక్షణ దుర్గము ,” నా పరలోక తండ్రిని చేరుకోవడానికి నా మార్గం, నేను ఒకప్పుడు కలిగి ఉన్న మరియు ఇప్పుడు మళ్లీ పొందాలనుకుంటున్న దానితో పాటు చాలా మరెన్నో తిరిగి రావడానికి నా ఏకైక మార్గం. మనకు ఆయన బహుమానము నేను ఎప్పటికీ పొందిన మిక్కిలి ఉదారమైనదిగా ఉన్నది, ఇది చాలా ఉదారంగా ఇవ్వబడింది—అది అంతములేని బాధతో కొనబడింది, అంతులేని ప్రేమతో దయచేయబడింది. ముండ్లతుప్పలు, గచ్చపొదలు, బాధ మరియు వేదన, ఈ లోకము యొక్క విచారము మరియు పాపము సమస్తము, “క్రీస్తు నందు మ్రింగి వేయబడినది.”

కాబట్టి 64 సంవత్సరాల క్రితం, 19 సంవత్సరాల వయస్సులో నేను ఎండోమెంట్ పొందినప్పటి నుండి తగినట్లుగా ప్రతి పగలు, రాత్రి—పరిశుద్ధ యాజకత్వము యొక్క వస్త్రమును నేను ధరించాను—ఎందుకనగా నేను ఆయనను ప్రేమిస్తున్నాను మరియు ఎందుకనగా అది ప్రాతినిధ్యం వహించే వాగ్దానాలు నాకు అవసరము.

వస్త్రము ధరించుట గురించి ప్రశ్నలు?

ఈ వ్యాసము చదువుతున్న మీలో కొందరు వస్త్రము గురించి ఒక ప్రత్యేక ప్రశ్నకు జవాబిస్తానని ఆశించవచ్చు. మీ హృదయానికి సన్నిహితమైన విషయంపై—“ప్రభువు సెలవిచ్చుచున్నాడు”—లేదా “ఆయన సేవకులకు సెలవిచ్చుచున్నాడు,” అని మీరు ఆశించవచ్చు. ఉద్యోగము, వ్యాయామము, పరిశుభ్రత, వాతావరణం, నమ్రత, సానిటరీ సౌకర్యాలు లేదా వైద్య పరిస్థితి సహా వ్యక్తిగత సంబంధింత పరిస్థితులనుండి మీ ప్రశ్న కలుగవచ్చు.

ఈ విధమైన ప్రశ్నలకు కొన్ని జవాబులు, temples.ChurchofJesusChrist.org మరియు General Handbook యొక్క 38.5 అధ్యాయములో కనుగొనబడవచ్చు. నమ్మకస్తులైన కుటుంబ సభ్యులు మరియు నాయకులు వ్యక్తిగత విషయం గురించి సంప్రదించబడవచ్చు. అయినప్పటికినీ, ప్రారంభ విధులలో చాలా స్పష్టమైన నడిపింపు ఇవ్వబడింది, మరియు అక్కడ మీ పరలోకమందున్న తండ్రి ఎప్పటికీ, శాశ్వతంగా, మిమ్మల్ని ఎరిగి, మిమ్మల్ని ప్రేమించి, మీ పరిస్థితులు గురించి సమస్తమును గ్రహిస్తారు. వ్యక్తిగతంగా మీరు ఆయనను ఈ ప్రశ్నలు అడిగితే ఆయన సంతోషిస్తారు.

శిఖరం యొక్క వీధి. జార్జ్ యూటా దేవాలయం

శిఖరం యొక్క వీధి యొక్క చిత్రము జార్జ్ యూటా దేవాలయం

దయచేసి అపార్థం చేసుకోవద్దు. దైవిక నడిపింపు కొరకు మీరు వెదకినప్పుడు, దేవాలయంలో పొందబడిన సూచనలను మరియు ప్రథమ అధ్యక్షత్వము ఇటీవల ప్రకటనలో పంచుకున్న ప్రవచనాత్మక సలహాలను అనుసరించడం కంటే తక్కువగా చేయడానికి ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించదు. ప్రేమగల తండ్రి, ఇప్పుడు మరియు ఎప్పటికీ మిమ్మల్ని ఆశీర్వదించే భక్తి మరియు నమ్రత యొక్క ప్రమాణాలకు అనుగుణంగా మీరు చేయగలిగిన దానికంటే తక్కువ చేయడంలో మీకు సహాయపడరు. కానీ ఆయన మీ ప్రశ్నలను గ్రహిస్తారా, వస్త్రమును గౌరవించి మరియు మీ నిబంధనలను పాటించు వలన దీవెనలు పొందడానికి ఆయన మీకు సహాయపడతారా? అవును! అవసరమైనప్పుడు మీరు సమర్ధులైన వైద్య, ఆరోగ్య నిపుణులను కూడ మీరు సంప్రదించాలా? అవును! మీరు ఇంగితజ్ఞానము లేదా గురిని దాటి చూడటం విస్మరించాలా? మీరు అలా చేయకూడదని నేను ప్రార్థిస్థున్నాను.

మీకు కలిగియున్న ప్రతి ప్రశ్నకు నేను జవాబివ్వలేను. నేను కలిగియున్న ప్రతి ప్రశ్నకు కూడా నేను జవాబివ్వలేను. కాని ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తులునిగా నేను, మీరు ఆయనతో చేసిన నిబంధనలను మీరు పాటించినప్పుడు, మీరు ఇప్పుడు అర్ధం చేసుకోలేని లేదా ఉహించలేని మార్గాల్లో మీ ప్రతి విజయాన్ని మరియు ఆశీర్వాదాన్ని కోరుకునే ప్రేమగల దేవుని సహాయాన్ని మీకు వాగ్దానం చేయగలను.

వివరణలు

  1. మోషే 5:4

  2. మోషే 4:27.

  3. మోషే 4:13-14 చూడండి.

  4. యెషయా 61:10; 2 నీఫై 9:14; ప్రకటన 19:8; 2 నీఫై 4:33; మోర్మన్ 9:5; సిద్ధాంతము మరియు నిబంధనలు 109:76.

  5. స్పష్టంగా, ఈ రోజు మనం ధరించే వస్త్రం ఆదాము, హవ్వలకు ఇవ్వబడిన చర్మపు దుస్తులను పోలి ఉండదు. నాణ్యంత మరియు నమూనా కలిపి, సంవత్సరాలుగా వస్త్రము వేర్వేరు విధాలుగా మారింది. కానీ నిజంగా ముఖ్యమైన విషయాలు—వస్త్రము యొక్క పరిశుద్ధ స్వభావము, అది సూచించే నిబంధనలు—మార్పు చెందవు.

  6. వస్త్రం యొక్క ఈ పూర్తి పేరు, సంఘము యొక్క పూర్తి పేరు వలె, బోధనాత్మకమైనది. యాజకత్వము దేవుని యొక్క శక్తి, మరియు వస్త్రము ధరించుట దేవునితో నిబంధనలు చేసి పాటించినప్పుడు మనకు లభ్యమయ్యే దైవిక శక్తి యొక్క జ్ఞాపకార్ధముగా ఉన్నది.

  7. మొరోనై 4:3; 5:2.

  8. 2 నీఫై 4:30.

  9. మోషైయ 16:8; యెషయా 31:38 కూడ చూడుము.