“అరణ్యములో మనకు వెలుగు,” లియహోనా, 2024 జనవరి.
లియహోనా నెలవారీ సందేశము, 2024 జనవరి
అరణ్యములో మనకు వెలుగు
మోర్మన్ గ్రంధమును హృదయ పూర్వకంగా చదువుచు, దాని ఉపదేశాల ప్రకారం జీవించు వారు, మరియు దాని సత్యసంధతను గూర్చి ప్రార్ధించు వారు పరిశుద్ధాత్మ అనుభూతిని పొందుదురు మరియు రక్షకునియందు, ఆయన సాక్ష్యము నందు విశ్వాసమును పెంపొందించుకొందురు.
నార్మాండీ పౌల్టర్ చేత పారదర్శక రాళ్ళతో జెరెడ్ యొక్క సహోదరుని చిత్రం
బాల్యంలోనే మోర్మన్ గ్రంధం గూర్చి నేను సాక్ష్యం పొందాను. జెరెడ్ యొక్క సహోదరుడు మరియు అతని జనులు “వాగ్దాన భూమికి” చేసిన ప్రయాణగాధ వలన నేను ప్రత్యేకంగా ఆకర్షింపబడ్డాను. (ఈథర్ 2:9).
దీపాలులేని తెప్పల మీద ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు జెరెడ్ యొక్క సహోదరుడు, అడిగాడు, చూడు, ఓ ప్రభువా, ఈ మహా జలములను అంధకారంలో దాటమని ఆదేశిస్తావా?” జవాబుగా ప్రభువు అన్నారు, “మీ పడవలలో వెలుతురు ఉండుటకు నన్నేమి చేయమంటారు?” ఈథర్ 2:22, 23.
ప్రభువు సర్వశక్తిమంతుడని జెరెడ్ యొక్క సహోదరునికి తెలియును. ప్రభువు సమస్త వెలుగునకు మూలమని అతనికి తెలియును. అవసరమైన సమయంలో ఆయనను పిలువమని ప్రభువు తన జనులకు ఆజ్ఞాపించియున్నారని అతనికి తెలియును. కనుక, ప్రభువునందు విశ్వాస సాధకముగా జెరెడ్ యొక్క సహోదరుడు 16 చిన్న రాళ్ళను సిద్ధము చేసెను. అప్పుడతడు, “అవి చీకటిలో ప్రకాశించునట్లు” ఆయన తన వ్రేలితో ఆ రాళ్ళను ముట్టవలెనని ప్రభువును అడిగెనని మీకు జ్ఞాపకముండును” (ఈథర్ 3:4).
ఆ కథను మొదటిసారి నేను చదివినప్పటినుండి, ప్రభువు ఆ రాళ్ళను ముట్టుచున్న దృశ్యము నా మనస్సులో అచ్చువేయబడియున్నది. ఆ సంఘటన నా కనుల యెదుట జరుగుచున్నదా అన్నట్లు నేను చూడగలను. బహుశా దానికి కారణం, వెలుగు చేత చీకటి చెదరగొట్టబడుట అను దృశ్యం నాకు నిజమైనది.
నేను పరిశుద్ధాత్మ అనుభూతిని పొందనప్పుడు, ప్రభువు ఆత్మతో నేను కొంచెం శృతి తప్పినప్పుడు, నేను అంధకారమును అనుభూతి చెందుతాను. కాని నేను మోర్మన్ గ్రంధమును చదివినప్పుడు ఆ వెలుగు తిరిగి వచ్చును. నాకు మోర్మన్ గ్రంధము ప్రభువు చేత ముట్టబడిన ఒక ప్రకాశించు రాయివలె ఉంటూఉన్నది. అది నా జీవిత ప్రయాణమంతా ప్రకాశింపచేసింది.
నిత్యమైన ఒక వెలుగు
పురాతన అమెరికాకు ప్రభువు హస్తముచేత కొనిపోబడిన వారివలె ఉన్నతమైన వాగ్దాన దేశమునకు మన ప్రయాణ సమయంలో మనమందరము తుఫానులను మరియు అంధకార దినములను ఎదుర్కొనుచు ఉంటాము. కాని ప్రభువు జెరెడీయులకు మరియు నీఫైయులకు ఏమి చేసెనో అదే మనకును చేయును. మనము ఆయనకు విధేయులమై, ఆయనయందు విశ్వాసమును సాధనచేస్తూ, మరియు ఆయన సహాయము కొరకు మనవి చేసినచో ఆయన మనలను నడిపించును మరియు మన మార్గమును వెలిగించును.
ప్రభువు నీఫైతో చెప్పెను, “అరణ్యములో నేను మీకు వెలుగుగా కూడ ఉందును; మరియు మీరు నా ఆజ్ఞలను పాటించినయెడల, నేను మీ యెదుట మార్గమును సిధ్ధపరచెదను; అందువలన మీరు నా ఆజ్ఞలను పాటించినంత కాలము మీరు వాగ్దాన దేశమునకు నడిపింపబడుదురు; మరియు మీరు నడిపింపబడినది నా చేతనేయని మీరు తెలుసుకొందురు” (1 నీఫై 17:13)
“నా మాటలు వినువారికి నిత్యము, ఒక వెలుగుగా ఉందును” అని ప్రభువు నీఫై సహొదరుడైన జేకబ్ తో చెప్పెను (2 నీఫై 10:14).
రక్షకుని గూర్చి, ప్రవక్తయైన అబినడై సాక్ష్యమిచ్చెను, “ఆయన లోకము యొక్క వెలుగు మరియు జీవమైయున్నాడు; ఔను, ఎన్నటికి ఆరిపోనటువంటి, ఒక అనంతమైన వెలుగు” మోషైయ 16:9).
రక్షకుడు స్వయంగా తన సాక్ష్యమిచ్చెను, “నేను లోకమునకు వెలుగును మరియు జీవమునై యున్నాను.” ఇంకను ఇట్లనెను, “ఇదిగో నేను లోకమునకు వెలుగును; నేను మీ కొరకు ఒక ఉదాహరణను స్థిరపరచి యున్నాను” (3 నీఫై 9:18; 18:16)
వెలుగు అనుభూతి పొందుట
మన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ను ప్రేమిస్తాను. ఆయన ప్రక్కన సేవచేయు ఆశీర్వాదము నేను పొందియున్నాను. ఆయన ఒక గదిలోనికి నడచినప్పుడు, ఆ గది వెంటనే తేజోవంతమైన అనుభూతి కలుగుతుంది. క్రీస్తు యొక్క వెలుగు ఆయనతోనుండును.
క్రీస్తు యొక్క వెలుగు నిజమైనది. అది దేవుని నుండి క్రీస్తు ద్వారా బయలుదేరు దైవిక శక్తి, అధికారము, లేక ప్రభావము మరియు అన్నింటికి జీవమును, మరియు వెలుగును ప్రసాదించును. అది దేవుని బిడ్డలను పరిశుధ్ధాత్మ యొధ్ధకు, మరియు యేసు క్రీస్తు సువార్త యొద్దకు నడిపించగలిగిన కోరదగిన దైవ వరం.1 మోర్మన్ గ్రంధ పఠనము ఆ వెలుగును బలపరచును.
మన ప్రయాణములో ఏ విధముగా సహాయము పొందియున్నామో జ్ఞాపకముంచుకొనుటకు కొన్నిసార్లు మనము గత జీవితములోనికి చూడవలసిన అవసరం ఉన్నది. గతమును జ్ఞాపకముంచుకొనుట వలన మనము రక్షకుని ప్రభావపు అనుభూతిని మరల పొందగలము. “జ్ఞాపకముంచుకొనుడి , జ్ఞాపకముంచుకొనుడి” (హీలమన్ 5:12), అని లేఖనములు చెప్పుచున్నప్పుడు, నేను అనుకుంటాను, అది “కేవలం ఆనాటి విషయాలు జ్ఞాపకముంచుకొనుట మాత్రమే కాదు, ఆనాటి వెలుగు యొక్క అనుభూతి మరల, మరల పొందవలెను.” అని చెప్పుచున్నవి.
కొందరికి ఆత్మీయ వెలుగు యొక్క అనుభూతి సులభంగా కలుగును. మరి కొందరికి, వ్యక్తిగత ప్రయాసల వలన లేక ప్రాపంచిక శోధనల మూలంగా ఆ వెలుగు యొక్క అనుభూతి కష్టతరం కావచ్చును. కాని, మనము విశ్వాసం కలిగియున్న యెడల వెలుగు—ఒక్కోసారి మనము ఊహించని విధంగా రావచ్చును.
“ప్రార్ధన పూర్వకంగా మోర్మన్ గ్రంధమును.ప్రతి రోజు,” అధ్యయనం చేయమని ఉపదేశించిన అధ్యక్షుడు నెల్సన్ మోర్మన్ గ్రంధము మనలను రక్షకునికి మరింత దగ్గరకు చేర్చుటకు, మరియు సువార్త వెలుగును అనుభూతి చెందుటకు, సువార్త సత్యములను గ్రహించుటకు, మరియు సువార్త బోధనలో జీవించుటకు సహాయపడు అనేక మార్గములను పంచుకున్నారు.
మోర్మన్ గ్రంధమును మనము చదువుచున్నప్పుడు అధ్యక్షుడు నెల్సన్ చెప్పినట్లు మనకు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము గూర్చిన అవగాహన, మరియు అభినందన పెంపొందును.
(మోషైయ 27:25) హృదయములందు మార్పు అనుభవించుటకు ఆ గ్రంధము మనకు సహాయ పడును. గనుక “తిరిగి జన్మించవలెను” అను కోరిక మనకు కలుగును (మోషైయ 5:2)
ఇశ్రాయేలు కూర్చబడుటను గూర్చి మోర్మన్ గ్రంధ బోధనలు చదువుచు, అధ్యయనము చేయునప్పుడు, చనిపోయిన మన పూర్వీకుల పక్షమున వారి రక్షణ మరియు ఔన్నత్యము కొరకు విధులను నిర్వహించుటకు మనలో అధికమైన కోరిక కలుగును.
మన ప్రశ్నలకు జవాబులు లభించునప్పుడు మనము వెలుగు అనుభూతిని, మన నిర్ణయాలలో నడిపింపు మరియు పశ్చాత్తాప పడుటకు మరియు దుష్టత్వాన్ని ఎదుర్కొనుటకు శక్తిని పొందుదుము.
మోర్మన్ గ్రంధములో కనబడు సత్యములను చదువుచున్నప్పుడు మనము స్వస్థత, ఆదరణ, పునఃస్థాపన, పోషణ, బలము, ఓదార్పు మరియు ఉత్సాహము మన ఆత్మలకు కలుగును.3
“ఓహో అయితే ఇది నిజము కాదా?” ఉబుకుచు మొలకెత్తుచున్న సత్యము యొక్క విత్తనము, విజ్ఞానము, మరియు సాక్ష్యమును గూర్చి అడిగెను. అవును, అని నేను మీతో చెప్పుచున్నాను, ఏలయనగా అది వెలుగైయున్నది; మరియు వెలుగైనది ఏదైనను అది మంచిది, ఏలయనగా అది వివేచింపబడగలదు, కావున అది మంచిదని మీరు తెలుసుకొనవలెను” (ఆల్మా 32:35).
Christ’s Image [క్రీస్తు యొక్క చిత్రము], హైన్రిక్ హాఫ్‌మన్ చేత
అంధకారములో రక్షకుని కనుగొనండి
నా స్నేహితురాలు కేమ్రిన్ 10 సంవత్సరాల వయసులో ఆమెకు ఒక తీరని అరుదైన కంటి వ్యాధి సోకింది. అది ఆమె కుడి కంటి పై పొరకు సంక్రమించింది.4 ఒక్కొక్క సారి దానికి సంబంధించిన నొప్పి తగ్గకుండా భరించ శక్యము కానప్పుడు కేమ్రిన్ ఏవిధమైన వెలుగును ఓర్చుకోలేక పోయేది. ఆమె గుడ్డిదైపోతుందేమోనని వ్యాకులపడి ఆమెకు ఇబ్బందిలేకుండా పడక గది కిటికీలు మూసి చీకటిగా చేసారు. కేమ్రిన్ యొక్క తల్లి, జేనా, జ్ఞాపకంచేసింది.
ఆమె రోగము నిర్దారణ ఐన సుమారు నాలుగు నెలల తరువాత నేను ఆమె యొక్క చీకటి గదిలోనికి నడిచాను. నా కళ్ళు చీకటికి అలవాటుపడినప్పుడు కేమ్రిన్ ఒక పిండము మాదిరిగ పడకపై ముడుచుకొని ఉండుట చూడగలిగాను. ఆమె ఎంత బాధలో ఉందంటే, నేను ప్రవేశించిన శబ్దం విన్నా కూడ ఆమె కదలలేదు, ఏడ్వలేదు కూడా. వాచియున్న రెండు కళ్ళు మూసుకొని అలా పడుకొని ఉంది.
“నేను ఆమె పడక ప్రక్కన మోకరించి ఆమె చేతిని నా చేతిలోనికి తీసుకొని మూడు సార్లు ఒత్తాను—అది ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అనడానికి మా రహస్య సంకేతం, మామూలుగానైతే ఆమె జవాబుగా నాలుగు సార్లు ఒత్తుతుంది. ‘నేను నిన్ను మరింత ప్రేమిస్తున్నాను’ అని. కాని ఆమె స్పందించలేదు. ఆమె చాలా ఎక్కువ బాధలో ఉంది. నా కన్నీరు చెక్కిలి మీదుగా ప్రవహిస్తూ ఉంది. ఒకప్పుడు ఉత్సాహంగా ఉండే 10 యేండ్ల ఆమె ముద్దగా ముడుచుకుపోయి ఉండడం చూచాను. నా గుండె కరిగిపోయింది.”
జేనా నెమ్మదిగా, హృదయ పూర్వక ప్రార్ధన చేసింది.
“నేను పరలోక తండ్రితో అన్నాను, ఏది ఉత్తమమైనదో నీకు తెలుసని నాకు తెలుసు, అయినను నేను ప్రార్ధించాను, ‘దయతో ఆమెకు సహాయం చేయుము’ ప్రార్ధన చేస్తూ అక్కడ నేను కూర్చొనియుండగా ఒక వెచ్చని వాయుతరంగం నా మీదుగా వీచింది. రక్షకుడు యేసు క్రీస్తు నా తలంపులోనికి వచ్చినపుడు నేను నెమ్మది పొందాను: ఆయనే ఆ వెలుగు. అంధకారంలో ఆయనను కనుగొనుము.”
జేనా తల ఎత్తి కేమ్రిన్ చెవిలో నెమ్మదిగా చెప్పింది: “నీవు అంధకారంలో రక్షకుని కనుగొనవలసి యున్నది”
తరువాత, కేమ్రిన్ సంఘ గ్రంధాలయ యాప్ నుండి పాటలు, మరియు లేఖనములు వింటూ నిద్రపోయింది.
ఆమె కంటి వ్యాధి ఉధృతం అయినప్పుడు కేమ్రిన్ అంధకారంలో రక్షకుని కనుగొన్నది.
ఛాయాచిత్రం కేమ్రిన్ కుటుంబ సౌజన్యంతో
కేమ్రిన్ యొక్క వ్యాధి ఎక్కువ భాగం నిద్రాణమై ఉంటుంది, కాని ఎప్పుడైనా ఉధృతమైనప్పుడు, జేనా మరియు ఆమె భర్త డేరిన్ ఆమెను ఆదరించి ఆమె పడకగది కిటికీలను దుప్పట్లతో మూస్తారు. ఆ బాధాకరమైన సమయాలలో కేమ్రిన్ అంటుంది, “నేను అంధకారంలో రక్షకుని కనుగొంటున్నాను. అంతే.” 5
జీవితం “ఒక అంధకారమైన మరియు విషాధభరితమైన అరణ్యం” అనిపించినపుడు (1 నీఫై 8:4, రక్షకుని అంధకారంలో కనుగొనడం మనకు కూడా అవసరం. నేను సాక్ష్యమిచ్చుచున్నాను మోర్మన్ గ్రంధం యొక్క సాక్ష్యం “యేసే క్రీస్తని, నిత్యుడైన దేవుడని”6 మనలను ఆయన యొద్దకు నడిపించును. నాకు తెలుసు, మోర్మన్ యొక్క గ్రంధమును మనఃస్పూర్తిగా చదువుచు, దాని ఉపదేశాల ననుసరించి జీవించుచు మరియు దాని సత్యసంధతను గూర్చి ప్రార్ధించువారు పరిశుద్ధాత్మను పొందుదురు మరియు రక్షకుని యందు ఆయన సాక్ష్యమందు విశ్వాసమును పెంపొందించుకొందురు.
దానిని చదువుట, నిధి వలే సమకూర్చుకొనుట, ఈ లోక వెలుగులో మనయొక్క, మరియు ఇతరుల యొక్క విశ్వాసమును బలపరచుట ద్వారా “మిక్కిలి ఖచ్చితమైన” ఈ గ్రంధము యెడల మన కృతజ్ఞతను చూపుదము7.
© 2024 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా.లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Liahona Message, January 2024 యొక్క అనువాదము Language. 19273 421