2023
యేసు క్రీస్తు సంఘము యొక్క నిర్మాణము
2023 అక్టోబరు


“యేసు క్రీస్తు సంఘము యొక్క నిర్మాణము,” లియహోనా, అక్టో. 2023.

లియహోనా నెలవారీ సందేశము, 2023 అక్టోబరు

యేసు క్రీస్తు సంఘము యొక్క నిర్మాణము

యేసు క్రీస్తు యొక్క చిత్రము

డెల్ పార్సన్ చేత ప్రభువైన యేసు క్రీస్తు

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క శిరస్సు యేసు క్రీస్తు. ఆయన క్రొత్త నిబంధన కాలములలో చేసినట్లుగా, నేడు సంఘాన్ని నడిపించడానికి ఆయన ప్రవక్తలను మరియు అపొస్తలులను ప్రేరేపిస్తున్నారు. వారు మిగిలిన సంఘ నాయకుల చేత సహకారమివ్వబడతారు.

యేసు క్రీస్తు యొక్క కడవరి పరిశుద్ధుల సంఘము రక్షకుని యొక్క సంఘము. అది “క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద కట్టబడియున్నది” (ఎఫెసీయులకు 2:20). దీని అర్ధము ఆయన పునాది యొక్క అత్యంత ముఖ్యమైన భాగము. ఆయన నాయకులుగా ఉండటానికి ఎంపిక చేసిన ప్రవక్తలు మరియు అపొస్తలుల ద్వారా సంఘాన్ని నడిపిస్తారు.

ప్రథమ అధ్యక్షత్వము

ప్రథమ అధ్యక్షత్వము

సంఘము యొక్క అధ్యక్షుడు నేడు భూమి మీద దేవుని యొక్క ప్రవక్త. ఆయన సీనియర్ అపొస్తలుడు మరియు భూమి మీద సంఘము మొత్తాన్ని నడిపించడానికి బయల్పాటును పొందే ఏకైక వ్యక్తి. తన సలహాదారులుగా సేవ చేయడానికి ఏ ఇద్దరు అపొస్తలులను పిలవాలో తెలుసుకోవడానికి ప్రభువు ఆయనను ప్రేరేపిస్తారు. వారు ప్రథమ అధ్యక్షత్వమును ఏర్పాటు చేస్తారు. ముగ్గురూ ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులు.

పన్నెండుమంది అపొస్తలుల సమూహము

పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క సభ్యులు కూడా ప్రవక్తలు, దీర్ఘదర్శులు, మరియు బయల్పాటుదారులు. వారు యేసు క్రీస్తు యొక్క ప్రత్యేక సాక్షులుగా పిలవబడ్డారు. ఆయన గురించి బోధించడానికి మరియు సాక్ష్యమివ్వడానికి వారు ప్రపంచమంతా ప్రయాణం చేస్తారు. (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:23, 33 చూడండి.)

డెబ్బది యొక్క సమూహములు

డెబ్బది యొక్క సభ్యులు కూడ యేసు క్రీస్తు యొక్క సాక్షులుగా ఉండటానికి పిలవబడ్డారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:25 చూడండి). వారు పన్నెండుమంది సమూహము సువార్తను బోధించడానికి మరియు ప్రపంచమంతటా సంఘమును కట్టడానికి సహాయపడతారు.

నాయకులు ఒకరినొకరు సంప్రదించుట

మెచికో హోరీ చేత ఛాయాచిత్రం

స్థానిక నాయకులు

మీ స్టేకు లేదా జిల్లా అధ్యక్షత్వము, బిషప్రిక్కు లేదా బ్రాంచి అధ్యక్షత్వము, ఎల్డర్ల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వములు కూడా దేవుని చేత పిలవబడ్డారు. మీరు సువార్తను నేర్చుకొని, జీవించడానికి వారు సహాయపడగలరు. 2022 మార్చి, సువార్త ప్రాథమిక అంశాల వ్యాసము, “సంఘ పిలుపులలో సేవ చేయుట” లో ఈ పిలుపులలో కొన్నిటిని గూర్చి మీరు నేర్చుకోవచ్చు.