కుటుంబ చరిత్ర మన పూర్వీకులకు సహాయపడుతుంది, లియహోనా, 2021 డిసెంబరు
2021 డిసెంబరు, లియహోనా నెలవారీ సందేశము
కుటుంబ చరిత్ర మన పూర్వీకులకు సహాయపడుతుంది
కుటుంబ చరిత్ర అనేది మన కుటుంబ సభ్యుల గురించి కనుగొనడం మరియు తెలుసుకోవడం. మన పూర్వీకుల గురించి సమాచారాన్ని కూడా సేకరిస్తాము ఆవిధంగా వారికి మనము దేవాలయ కార్యము చేయగలము.
పరలోక తండ్రి యొక్క సంతోషకర ప్రణాళికకు కుటుంబాలు ప్రధానమైనవి. కుటుంబాలు శాశ్వతంగా కొనసాగడానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధం చేసారు. మనము మన కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యము చేసినప్పుడు, జీవించి ఉన్న మరియు మరణించిన మన కుటుంబ సభ్యులను కలిపి చేర్చడానికి మనము సహాయం చేస్తాము. (“దేవాలయ కార్యము” అంటే మన జీవిత భాగస్వామికి ముద్రించబడడం వంటి దేవాలయ విధులను మన కొరకు మనం పొందడం, అలాగే మన పూర్వీకుల కోసం దేవాలయంలో విధులు నిర్వహించడం.)
కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యము
భూమిపై జీవించిన లేదా జీవించబోయే ప్రతి వ్యక్తికి సువార్త విధులు అవసరం. మన పూర్వీకులకు ఆ అవకాశం లేకుంటే, దేవాలయంలో వారి కొరకు విధులను మనం నిర్వహించగలము. ఆ విధులలో ఒకటి కుటుంబ సభ్యులతో ముద్రించబడడం. “ముద్రించబడడం” అంటే మనం నీతిమంతులమైతే మన కుటుంబాలతో శాశ్వతముగా జీవించగలుగుతాము. దేవాలయాలలో మాత్రమే మనం మన కుటుంబాలతో ముద్రించబడగలుగుతాము.
కుటుంబ చరిత్ర కార్యము యొక్క దీవెనలు
కుటుంబ చరిత్ర మన జీవిస్తున్న కుటుంబ సభ్యులతో మన అనుబంధాలను బలపరచడానికి మనకు సహాయపడగలదు. కథలు, ఫోటోలు మరియు ఇతర జ్ఞాపకాలను మనము ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడు, మనము కుటుంబ బంధాలను ఏర్పరుస్తాము. మనం ఒకరిపట్ల మరొకరికి ఉన్న ప్రేమను కూడా బలపరుస్తాము. మన కుటుంబ చరిత్రపై పని చేయడం వల్ల మనల్ని యేసు క్రీస్తుకు దగ్గర చేస్తుందని కూడా ప్రవక్తలు వాగ్దానం చేసారు.
మన పూర్వీకులను కనుగొనుట
మన ప్రస్తుత కుటుంబాలకు మరియు మన పూర్వీకులకు మనం ముద్రించబడాలని పరలోకపు తండ్రి కోరుకుంటున్నారు. మన పూర్వీకులతో ముద్ర వేయబడడానికి ముందు, మనము వారి గురించిన సమాచారాన్ని కనుగొని, ఆపై దానిని భద్రపరచాలి. కానీ కుటుంబ చరిత్ర కేవలం పేర్లు, తేదీలు మరియు స్థలాలను పరిశోధించడం కంటే ఎక్కువైనది. మన పూర్వీకుల గురించి మనం తెలుసుకునే కొద్దీ, వారితో మరింత అనుసంధానించబడినట్లుగా భావిస్తాము.
© 2021 by Intellectual Reserve, Inc. All rights reserved. అమెరికాలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Liahona Message, December 2021 యొక్క అనువాదము. Telugu. 17476 421