2021
బాప్తీస్మము తీసుకోవాలని దేవుడు మనకు చెప్పెను.
ఫిబ్రవరి 2021


“బాప్తీస్మము తీసుకోవాలని దేవుడు మనకు చెప్పెను,” లియహోనా, ఫిబ్రవరి 2021

ఫిబ్రవరి 2021, లియహోనా నెలవారీ సందేశము

బాప్తీస్మము తీసుకోవాలని దేవుడు మనకు చెప్పెను.

దేవుని యొక్క అధికారము పొందిన ఒకరి ద్వారా బాప్తీస్మము తీసుకోవడానికి యేసు క్రీస్తు ఒక మాదిరిగా ఉన్నాడు.

యేసు క్రీస్తు యొక్క వ్యక్తిగత జీవితమును గూర్చి మనకు ఎక్కువ వివరాలు లేకపోయినప్పటికినీ, దాదాపు 30 యేండ్ల వయస్సులో ఆయన బాప్తీస్మము తీసుకొన్నాడని మనకు తెలుసు (లూకా 3:23 చూడుము). బాప్తీస్మము గూర్చి ఇక్కడ కొన్ని విషయములు ఆయన మాదిరి ద్వారా మనము నేర్చుకుంటాము.

ప్రతి ఒక్కరి కొరకు

తప్పు, ఒప్పుల మధ్య తేడా చెప్పగల వయస్సు మరియు జ్ఞానము మనము కలిగియున్న యెడల మనము బాప్తీస్మము తీసుకోవాలని పరలోక తండ్రి కోరుచున్నాడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:42 చూడుము). యేసు పరిపూర్ణుడు, ఐనప్పటికీ ఆయన దేవుని ఆజ్ఞలను పాటించవలెనని బాప్తీస్మము తీసుకోవాలని కోరుకున్నాడు (మత్తయి 3:13– 17; 2 నీఫై 31:7 చూడుము). ఇప్పటికే మృతిపొందిన వారు కూడా బాప్తీస్మమును అంగీకరించవచ్చును. దేవాలయములలో వారి తరపున మనము వారికి బాప్తీస్మము అందిస్తాము. (సిద్ధాంతము మరియు నిబంధనలు 128:15–18 చూడుము.)

బాప్తీస్మము

అధికారము చేత నిర్వహించబడెను

యేసు ఎవరుపడితే వారిచేత బాప్తీస్మము పొందలేదు. దేవుని నుండి యాజకత్వపు అధికారము పొందిన తన బంధువైన యోహాను వద్దకు ఆయన ప్రత్యేకముగా వెళ్ళాడు. యేసు చనిపోయాక మరియు ఆయన శిష్యులు చంపబడిన తరువాత, ఆ యాజకత్వపు అధికారము భూమిమీద నుండి కోల్పోబడింది. తరువాత, 1829 లో, బాప్తీస్మమిచ్చు యోహాను, జోసెఫ్ స్మిత్‌కు ప్రత్యక్షమై దేవుని పేరిట బాప్తీస్మమిచ్చు అధికారమును ఆయనకు ఇచ్చెను. ఆ పునఃస్థాపన కారణంగానే, ఈ రోజు మనం అదే అధికారముతో బాప్తీస్మము పొందవచ్చును.

అహరోను యాజకత్వము యొక్క పునఃస్థాపన

ఉభయపక్షమైన వాగ్దానము

బాప్తీస్మము మనకును, దేవునికిని మధ్య ఉభయపక్షమైన వాగ్దానము, లేక నిబంధనను, కలిగియున్నది. మనము వాగ్దానము చేస్తున్నాము:

  1. మనము క్రీస్తు నామమును మనపై ధరించుటకు.

  2. ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనుటకు.

  3. ఆయన ఆజ్ఞలను పాటించుటకు.

బదులుగా, దేవుడు తన ఆత్మ ఎల్లప్పుడు మనతో ఉంటుందని వాగ్దానము చేస్తున్నాడు. సంస్కార ప్రార్థనల యొక్క మాటలు ప్రతి వారము ఆయన యొక్క నిబంధనను మనకు జ్ఞాపకము చేస్తాయి. (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79 చూడండి.)

సంస్కార సమావేశములో కుటుంబము

బాప్తీస్మములో ఒక ముఖ్యమైన భాగము పరిశుద్ధాత్మను పొందుట.

యేసు బాప్తీస్మము పొందిన తరువాత, పరిశుద్ధాత్మ ఒక పావురము రూపములో ప్రత్యక్షమయ్యెను ({2 నీఫై 31:8 చూడండి). ఈ రోజు, జనులు బాప్తీస్మము పొందిన తరువాత, వారు నిర్ధారించబడతారు. అనగా వారు ఒక ప్రత్యేకమైన దీవెనను పొందుతారు, దానిలో వారు ఆత్మీయంగా పవిత్రపరచే పరిశుద్ధాత్మను వరముగా పొందడానికి ఆహ్వానించబడతారు (2 నీఫై 31:17 చూడండి). పరిశుద్ధాత్మ మనలను ప్రమాదమును గూర్చి హెచ్చరించగలదు, మనకు ఆదరణ నివ్వగలదు, మంచి నిర్ణయాలు చేయడానికి మనల్ని నడిపించగలదు మరియు మనము దేవుని ప్రేమను అనుభవించడానికి సహాయపడగలదు (సిద్ధాంతము మరియు నిబంధనలు 39:6 చూడండి}).

నిర్ధారించబడిన స్త్రీ

మనము ఎల్లప్పుడు పశ్చాత్తాపపడగలము

మనము పొరపాట్లు చేస్తామని దేవునికి తెలుసు. మన ప్రయత్నాలు ఎంత గొప్పవైనప్పటికినీ, మనం పాపము చేస్తాము మరియు మన బాప్తీస్మపు వాగ్దానముల ప్రకారము జీవించడంలో వెనుక బడుతున్నాము. కనుక ఆయన మనలో ప్రతిఒక్కరికి పశ్చాత్తాపపడటానికి అవకాశము ఇస్తున్నాడు. (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:13 చూడుము.) ప్రతిరోజూ క్షమాపణ వేడుకొని తప్పులేవైనా దిద్దుకోవడానికి మనకు శాయశక్తులా చేయవచ్చు. మనము ప్రార్థన చేసి, దేవునిని క్షమాపణ అడగవచ్చును. తరువాత, మనము దీన హృదయముతో సంస్కారము తీసుకొన్నప్పుడు, మనము పరిశుద్ధాత్మను మనతో కలిగియుండగలము (3 నీఫై 18:11 చూడండి).

మంచం ప్రక్కన ప్రార్థిస్తున్న స్త్రీ

బాప్తీస్మమును గూర్చి లేఖనములు ఏమి చెప్పుచున్నాయి?

తల్లిదండ్రులు తమ పిల్లలు బాప్తీస్మము కొరకు సిద్ధపడునట్లు సహాయపడవలెను (సిద్ధాంతము మరియు నిబంధనలు 68:25 చూడండి).

ఎనిమిది సంవత్సరాలలోపు చిన్న పిల్లలకు బాప్తీస్మము అవసరములేదు (మొరోనై 8 చూడండి).

మనము బాప్తీస్మము పొందినపుడు, “మనము దుఖించు వారితో దుఖించుటకు; ,…ఆదరణ అవసరములో నున్న వారిని ఆదరించుటకు, మరియు అన్ని సమయములలో మరియు అన్ని విషయములలో మరియు అన్ని స్థలములలో దేవునికి సాక్షులుగా నిలబడుటకు” వాగ్దానము చేస్తున్నాము (మోషైయ 18:9).