2020–2024
సంఘ ఆడిటింగ్ విభాగ నివేదిక, 2020
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


1:41

సంఘ ఆడిటింగ్ విభాగ నివేదిక, 2020

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రథమ అధ్యక్షత్వమునకు

ప్రియమైన సహోదరులారా: సిద్ధాంతము మరియు నిబంధనల 120వ ప్రకరణం లో నమోదు చేయబడిన బయల్పాటు నిర్ధేశానుసారం, ప్రథమ అధ్యక్షత్వం, పన్నెండుమంది అపొస్తలుల సమూహముతో కూడిన దశమభాగ వినియోగ సభ, సంఘ నిధుల వినియోగాన్ని ఆమోదిస్తుంది. సంఘ విభాగాలు ఆమోదించబడిన ఆదాయ వ్యయ అంచనాలు, అభిమతాలు, విధానాల ప్రకారం నిధులను వినియోగిస్తాయి.

సంఘ ఆడిటింగ్, విశ్వాస యోగ్యులైన నిపుణులతో, అన్ని సంఘ విభాగముల నుండి స్వతంత్రంగా, సంఘ ఆర్థికవనరులను సంరక్షించులాగున పొందిన విరాళాలు, చేసిన ఖర్చులను గూర్చి సరియైన భరోసా ఇచ్చు ఉద్దేశ్యంతో విమర్శనలు జరిపే బాధ్యతను కలిగియున్నది.

జరుపబడిన ఆడిట్ల ద్వారా, సంఘ ఆడిటింగ్ 2020 సంవత్సరానికి చెందిన, అన్ని భౌతిక సంబంధమైన విషయాలు, పొందిన విరాళాలు, చేయబడిన ఖర్చులు, సంఘ ఆస్థులు ఆమోదించబడిన సంఘ ఆదాయ వ్యయ అంచనాలు, అభిమతాలు, వాణిజ్య సాధనాల ప్రకారం నమోదు చేయబడ్డాయని, నిర్వహించబడినవని భావిస్తుంది. సంఘం దాని సభ్యులకు బోధించే ఆదాయ వ్యయ అంచనాలలోనే జీవించుట, అప్పు చేయకుండుట మరియు అవసరతగల సమయానికి దాచుకొనుట వంటి ఆచరణలను అనుసరిస్తుంది.

గౌరవనీయంగా నివేదించబడింది,

సంఘ ఆడిటింగ్ విభాగము

జారెడ్ బి. లార్సన్

నిర్వాహణాధికారి