2010–2019
తండ్రి
అక్టోబర్ 2018


10:17

తండ్రి

మనలో ప్రతీఒక్కరము తండ్రి వలే కాగల సాధ్యతను కలిగియున్నాము. ఆవిధంగా చేయుటకు, మనము కుమారుని యొక్క నామములో తండ్రిని ఆరాధించాలి.

నా భార్య మెలిండా, తన జీవితకాలమంతా, యేసు క్రీస్తు యొక్క విశ్వాసురాలైన శిష్యురాలిగా ఉండుటకు తన పూర్ణ హృదయముతో ప్రయత్నించింది. అయినప్పటికీ, తన యౌవనారంభంలో, ఆమె ఆయన స్వభావమును అపార్థము చేసుకున్నది కనుక, ఆమె పరలోకపు తండ్రి యొక్క ప్రేమ మరియు దీవెనలకు అయోగ్యురాలిగా భావించింది. అదృష్టవశాత్తూ, మెలిండా, తాను పొందిన విచారమును లక్ష్యపెట్టకుండా, ఆజ్ఞలను పాటించుట కొనసాగించింది. తన పిల్లల కొరకు ఆయన ప్రేమ, ఆయన పనిని చేయుటకు మన అపరిపూర్ణమైన ప్రయత్నాల కొరకు ఆయన కృతజ్ఞతతో కలిపి దేవుని స్వభావమును బాగా గ్రహించుటకు కొన్ని సంవత్సరాల క్రితం ఆమెకు కలిగిన అనుభవాల పరంపర ఆమెకు సహాయపడింది.

ఇది ఆమెను ఎలా ప్రభావితం చేసిందో ఆమె వివరించింది: “తండ్రి యొక్క ప్రణాళిక పని చేస్తుందని, ఆయన మన విజయములో వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టారని, ఆయన సన్నిధికి తిరిగి వెళ్లుటకు మనకవసరమైన పాఠములు మరియు అనుభవాలను మనకు ఇస్తారని నిశ్చయముగా నేనిప్పుడు భావిస్తున్నాను. నన్ను మరియు ఇతరులను దేవుడు మనల్ని చూసినట్లుగా నేను చూస్తున్నాను. నేను తల్లిగా బోధించి, ఎక్కువ ప్రేమతో మరియు తక్కువ భయముతో సేవ చేయగలను. ఆందోళన, అభద్రత కంటే మేలుగా శాంతిని, విశ్వాసమును అనుభూతి చెందుతున్నాను. విమర్శించబడినట్లుగా భావించుటకు బదులుగా, నేను బలపరచబడుతున్నాను. నా విశ్వాసము ఎక్కువ నిశ్చయమైనది. నేను నా తండ్రి యొక్క ప్రేమను ఎక్కువ తరచుగా మరియు ఎక్కువ లోతుగా అనుభవిస్తున్నాను.” 1

“ఉన్నతస్థితిని పొందుటకు తగినంత విశ్వాసమును సాధన చేయుటకు (పరలోక తండ్రి యొక్క) స్వభావము, పరిపూర్ణతలు, మరియు లక్షణాలను గూర్చి ఖచ్చితమైన ఆలోచనను” కలిగియుండుట ఆవశ్యకమైనది.2 పరలోక తండ్రిని గూర్చి సరైన అవగాహన మనల్ని, ఇతరులను మనం చూసే విధానమును మార్చగలదు మరియు ఆయన పిల్లల కొరకు దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను, ఆయన వలే అగుటకు మనకు సహాయపడాలనే ఆయన గొప్ప కోరికను గ్రహించుటకు మనకు సహాయపడును. ఆయన స్వభావమును గూర్చి సరికాని దృక్పథము ఆయన సన్నిధికి తిరిగి వెళ్లుటకు మనము ఎప్పటికీ సమర్థులము కాదని భావించునట్లు చేయవచ్చు.

ఈరోజు తండ్రి గురించి ముఖ్యమైన సిద్ధాంతపరమైన విషయాలను బోధించుట నా లక్ష్యము, అది మనలో ప్రతీఒక్కరిని, ప్రత్యేకంగా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడా అని ఆశ్చర్యపడువారిని, ఆయన నిజమైన స్వభావమును సరిగ్గా గ్రహించుటకు మరియు ఆయన, ఆయన కుమారునియందు, మన కొరకు ఆయన ప్రణాళికయందు గొప్ప విశ్వాసమును సాధన చేయుటకు అనుమతించును.

మర్త్యత్వమునకు ముందు లోకము

మర్త్యత్వమునకు ముందు లోకములో, మనము పరలోకపు తల్లిదండ్రులకు ఆత్మలుగా జన్మించాము మరియు ఒక కుటుంబముగా వారితో జీవించాము.3 వారు మనల్ని ఎరిగి, మనకు బోధించి, మనల్ని ప్రేమించారు. 4 మనము మన పరలోకపు తండ్రి వలె ఉండాలని ఎక్కువగా కోరుకున్నాము. అయినప్పటికీ, ఆవిధంగా చేయుటకు మనమిలా చేయాలని గుర్తించాము:

  1. మహిమపరచబడిన, అమర్త్యమైన, భౌతిక శరీరాలను పొందాలి; 5

  2. వివాహము చేసుకోవాలి, యాజకత్వము యొక్క ముద్రణాధికారముచేత కుటుంబాలను ఏర్పరచుకోవాలి;6 మరియు

  3. సమస్త జ్ఞానము, శక్తి మరియు దైవిక లక్షణాలను సంపాందించాలి.7

తత్ఫలితంగా తండ్రి ఒక ప్రణాళికను సృష్టించారు, అది నిర్ధిష్టమైన షరతులపై8 పునరుత్థానములో అమర్త్యమైన మహిమపరచబడిన భౌతిక శరీరాలను పొందుటను సాధ్యపరచును; మర్త్యత్వములో వివాహము చేసుకొని, కుటుంబాలను రూపించాలి లేదా అవకాశములేని విశ్వాసులు మర్త్యత్వము తరువాత; 9 పరిపూర్ణతవైపు వృద్ధి చెందుతారు; చివరకు మన పరలోక తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లి, వారితో మరియు మన కుటుంబాలతో మహోన్నత స్థితి మరియు నిత్య సంతోషము యొక్క స్థాయిలో జీవిస్తాము. 10

లేఖనాలు దీనిని రక్షణ ప్రణాళిక అని పిలుస్తాయి.11 ఈ ప్రణాళిక కొరకు మనము చాలా కృతజ్ఞత కలిగియున్నాము, అది మనకు సమర్పించబడినప్పుడు, మనము సంతోషముతో కేకలు వేసాము.12 దైవిక లక్షణాలను వృద్ధి చేయడానికి మనకు సహాయపడు మర్త్య అనుభవాలు మరియు సవాళ్ళతోపాటు, ప్రణాళిక యొక్క షరతులను మనలో ప్రతీఒక్కరం అంగీకరించాము.13

మర్త్య జీవితము

మర్త్యత్వములో, పరలోకపు తండ్రి ఆయన ప్రణాళిక లోపల వృద్ధి చేయడానికి అవసరమైన షరతులను మనకు దయచేసారు. తండ్రి, యేసు క్రీస్తును శరీరమందు కనియున్నాడు14 మరియు ఆయన మర్త్య పరిచర్యను నెరవేర్చుటకు ఆయనకు దైవిక సహాయమును అందించారు. అదేవిధంగా ఆయన ఆజ్ఞలను పాటించడానికి మనము ప్రయాసపడినట్లైతే, పరలోకపు తండ్రి మనలో ప్రతీఒక్కరికి సహాయపడతారు.15 తండ్రి మనకు కర్తృత్వాన్ని ఇస్తారు. 16 మన జీవితాలు ఆయన చేతులలో ఉన్నాయి, మన “దినములు లెక్కించబడినవి” మరియు “తక్కువగా లెక్కించబడవు.”17 చివరకు ఆయనను ప్రేమించువారి మేలు కొరకు సమస్త విషయాలు పనిచేయునట్లు ఆయన నిశ్చయపరుస్తారు.18

పరలోక తండ్రి మన అనుదిన ఆహారమును మనకిస్తారు,19 అది మనము తినే ఆహారమును, ఆయన ఆజ్ఞలను పాటించుటకు మనకవసరమైన బలమును రెండింటిని కలిగియుంది.20 తండ్రి మంచి వరములను ఇస్తారు.21 ఆయన మన ప్రార్థనలు విని జవాబిస్తారు.22 మనము ఆయనను అనుమతించినప్పుడు పరలోకపు తండ్రి మనల్ని చెడు నుండి విడిపిస్తారు.23 మనము బాధపడినప్పుడు ఆయన మన కొరకు దుఃఖిస్తారు.24 చివరకు, మన దీవెనలన్నీ తండ్రినుండి వస్తాయి.25

పరలోకపు తండ్రి మనకు నడిపింపునిస్తారు మరియు మనము మంచి ఫలమును ఫలించునట్లు మన బలములు, బలహీనతలు, ఎంపికలపై ఆధారపడి మనకవసరమైన అనుభవాలనిస్తారు.26 ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు, కనుక అవసరమైనప్పుడు మనల్ని గద్దిస్తారు.27 ఆయన “ఉపదేశకుడు,”28 మనము అడిగినట్లైతే మనకు ఉపదేశిస్తారు. 29

పరలోకపు తండ్రియే మన జీవితాలలోనికి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావమును మరియు వరమును రెండిటిని పంపుతారు.30 పరిశుద్ధాత్మ వరము ద్వారా, తండ్రి యొక్క మహిమ---లేక తెలివి, వెలుగు మరియు శక్తి----మనలో నివసించగలవు.31 మన కళ్ళు దేవుని మహిమపై దృష్టి నిలుపునంత వరకు వెలుగు మరియు సత్యములో వృద్ధి చెందుటకు మనము ప్రయాసపడినట్లైతే, మనకు నిత్యజీవమును ముద్రవేయుటకు మరియు ఈ జీవితంలో లేక తరువాత జీవితంలో---మనకు ఆయన ముఖమును బయల్పరచుటకు పరిశుద్ధాత్మ వాగ్దానమును పరలోక తండ్రి పంపుతారు.32

మర్త్యత్వము తరువాత జీవితము

మర్త్యత్వము తరువాత ఆత్మ లోకములో, పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మను క్రుమ్మరించుటను, సువార్త అవసరమైన వారికి మిషనరీలను పంపుటను కొనసాగిస్తారు. ఆయన ప్రార్థనలకు జవాబిస్తారు మరియు రక్షించే విధులు కొదువుగా ఉన్న వారు వాటిని పొందుటకు సహాయపడతారు.33

తండ్రి, యేసు క్రీస్తును లేపి, పునరుత్థానమును తెచ్చుటకు ఆయనకు శక్తినిచ్చారు,34 దాని ద్వారా మనము అమర్త్య శరీరములను పొందుతాము. రక్షకుని విమోచన మరియు పునరుత్థానము తండ్రి యొక్క సన్నిధికి మనల్ని తిరిగి తెస్తుంది, అక్కడ మనము యేసు క్రీస్తు చేత తీర్పు తీర్చబడతాము.35

“పరిశుద్ధ మెస్సీయా యొక్క మంచితనము, కనికరము మరియు కృప” 36 పై ఆధారపడువారు తండ్రి వలే మహిమగల శరీరాలను పొందుతారు37 మరియు “అంతముకాని సంతోషము యొక్క స్థితిలో” 38 ఆయనతో నివసిస్తారు. అక్కడ, తండ్రి మన సమస్త కన్నీళ్ళను తుడిచివేసి, 39 ఆయన వలే అగు మన ప్రయాణములో కొనసాగుటకు మనకు సహాయపడతారు.

మీరు చూడగలిగినట్లుగా, పరలోకపు తండ్రి ఎల్లప్పుడు మన కొరకు ఉన్నారు. 40

తండ్రి యొక్క స్వభావము

తండ్రివలే కావడానికి మనము ఆయన స్వభావ లక్షణాలను వృద్ధి చేయాలి. పరలోకపు తండ్రి యొక్క పరిపూర్ణతలు మరియు లక్షణాలు క్రింది వాటిని కలిపియున్నవి:

  • తండ్రి “అంతములేని వాడు మరియు నిత్యుడు.” 41

  • ఆయన పరిపూర్ణముగా న్యాయవంతుడు, కనికరము, దయ, దీర్ఘ శాంతము గలవాడు మరియు మన కొరకు శ్రేష్టమైనది మాత్రమే కోరుకొనువాడు. 42

  • పరలోకపు తండ్రి ప్రేమా స్వరూపి. 43

  • ఆయన తన నిబంధనలను నిలుపుకొనును. 44

  • ఆయన మార్పు చెందడు.45

  • ఆయన అబద్ధమాడడు.46

  • తండ్రి పక్షపాతి కాడు.47

  • ఆయన ఆరంభం నుండి----గతము, ప్రస్తుతము, మరియు భవిష్యత్తు-- సమస్త విషయాలను ఎరుగును.50

  • మనందరికంటే49 పరలోకపు తండ్రి మహాజ్ఞాని. 50

  • తండ్రి సమస్త శక్తిని కలిగియున్నారు51 మరియు ఆయన కోరుచున్న సమస్తమును చేయుదురు. 52

సహోదర సహోదరీలారా, మనము తండ్రియందు నమ్మకముంచగలము మరియు ఆధారపడగలము. ఆయన నిత్య దృష్టికోణమును కలిగియున్నారు కనుక, మనము చూడలేని విషయాలను పరలోకపు తండ్రి చూడగలరు. మన అమర్త్యత్వమును, ఉన్నత స్థితిని తెచ్చుటయే ఆయన ఆనందము, కార్యము, మహిమ.53 ఆయన చేయు సమస్తము మన ప్రయోజనము కొరకైనది. ఆయన “(మన) నిత్య సంతోషమును (మన) కంటే ఎక్కువగా కోరుతారు.” 54 ఆయన “(మన) ప్రయోజనము కొరకు లేక (మనము) ప్రేమించు వారి కొరకు ఖచ్చితంగా అవసరమైన దానికంటే ఎక్కువ కష్టమైన ఒక్క క్షణమును అనుభవించుటకు కూడా (మనల్ని) కోరరు.”55 ఫలితంగా, మనము వృద్ధి చెందడానికి సహాయపడడంపై ఆయన దృష్టిసారిస్తారు, కానీ మనల్ని విమర్శించడం మరియు నిందించడం పైన కాదు.56

మన తండ్రి వలే అగుట

దేవుని యొక్క ఆత్మ కుమారులు, కుమార్తెలుగా, మనలో ప్రతిఒక్కరు తండ్రి వలే అయ్యే సాధ్యతను కలిగియున్నారు. ఆవిధంగా చేయడానికి, మనము కుమారుని నామములో తండ్రిని ఆరాధించాలి.57 దీనిని మనము రక్షకుడు చేసినట్లుగా, 58 తండ్రి యొక్క చిత్తమునకు విధేయులగుటకు ప్రయాసపడుట ద్వారా మరియు నిరంతరము పశ్చాత్తాపపడుట ద్వారా చేయగలము.59 ఈ విషయాలను మనము చేసినప్పుడు, మనము తండ్రి యొక్క సంపూర్ణతను పొందేంత వరకు60 “కృప వెంబడి కృపను పొందుతాము” మరియు “ఆయన స్వభావము, పరిపూర్ణతలు, మరియు లక్షణాల”61 తో దీవించబడతాము.

మర్త్యులుగా మనమేమిటి మరియు పరలోకపు తండ్రి ఏవిధంగా ఉన్నారనే దాని మధ్య తేడాను ఆలోచించినప్పుడు, తండ్రివలే మారుట అసాధ్యమైనదని కొందరు భావించడంలో ఆశ్చర్యం లేదు. అయినప్పటికీ, లేఖనాలు స్పష్టముగా ఉన్నాయి. మనము క్రీస్తును విశ్వాసమందు హత్తుకొని, పశ్చాత్తాపపడి, విధేయత ద్వారా దేవుని కృపను వెదకినట్లైతే, క్రమంగా మనము తండ్రి వలే మారతాము. విధేయులుగా ఉండుటకు ప్రయాసపడువారు “కృప వెంబడి కృపను పొంది, ” చివరకు “ఆయన సంపూర్ణతను పొందుతారు62 అనే వాస్తవంలో నేను గొప్ప ఓదార్పును పొందుతాను. మరొక మాటలలో, మన స్వంతంగా మనము తండ్రి వలే మారము.63 బదులుగా, ఆ మార్పు అనేది కృప యొక్క వరముల ద్వారా వస్తుంది, కొన్ని వరములు పెద్దవి, కాని చాలావరకు చిన్నవిగా ఉండి, మనము సంపూర్ణతను పొందు వరకు అవి ఒక దానితో మరొకటి జతచేరుతాయి. కాని మార్పు వస్తుంది!

మిమ్మల్ని ఎలా ఉన్నత స్థితిలో ఉంచాలో పరలోకపు తండ్రి ఎరుగునని విశ్వసించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను; అనుదినము బలపరచు ఆయన సహాయమును వెదకండి; మీరు దేవుని ప్రేమను భావించలేనప్పుడు కూడా క్రీస్తునందు విశ్వాసముతో ముందుకు త్రోసుకొని వెళ్ళండి.

తండ్రి వలే అగుట గురించి మనము గ్రహించనిది అత్యధికమున్నది.64 కాని తండ్రి వలే అగుటకు ప్రయాసపడుట ప్రతీ త్యాగము కంటే విలువైనదని నిశ్చయముగా నేను సాక్ష్యమివ్వగలను.65 మర్త్యత్వములో మనము చేయు త్యాగములు ఎంత గొప్పవైనప్పటికీ, దేవుని సన్నిధిలో మనము అనుభూతి చెందే లెక్కలేనంత ఆనందము, సంతోషము, ప్రేమకు సాటిరావు.66 మిమ్మల్ని చేయమని అడిగిన త్యాగములను మించి ఇది విలువైనదని నమ్ముటకు మీరు ప్రయాసపడినట్లైతే, రక్షకుడు ఇలా చెప్తూ మిమ్మల్ని పిలుస్తున్నారు, “తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన దీవెనలు . . . ఎంత గొప్పవో మీరింకను గ్రహించలేదు; . . . మీరు ఇప్పుడు అన్ని విషయాలను వహించలేరు; అయినప్పటికీ, సంతోషించుడి, ఏలయనగా నేను మీ వెంట ఉండి నడిపించెదను.”67

మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నారని, మరలా మీరు ఆయనతో జీవించాలని కోరుతున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. Notes in possession of the author; see also D. Melinda Ashton, “The Holy Ghost: Direction, Correction, and Warning” (Brigham Young University Women’s Conference, Apr. 28, 2016), byutv.org.

  2. Lectures on Faith (1985), 38.

  3. See “The Family: A Proclamation to the World,” Liahona, May 2017, 145; “Mother in Heaven,” Gospel Topics, topics.lds.org.

  4. మనము తండ్రిని ఎంతగా ఎరుగుదుమనగా, మన ఆత్మలు అబ్బా అని పిలుచుటకు ఇంకను ఆపేక్షిస్తాయని అపొస్తలుడైన పౌలు సూచించాడు, దాని అర్థము “నాన్న,” అది మనము మిక్కిలి పరిచయము కలిగియుండు తండ్రుల కొరకు దాచబడిన పదము (రోమా 8:15 చూడుము).

  5. సిద్ధాంతము మరియు నిబంధనలు 130:22 చూడుము.

  6. సిద్ధాంతము మరియు నిబంధ132:19–20 చూడుము.

  7. మత్తయి 5:48 చూడుము; 2 పేతురు 1:3–8 కూడా చూడుము.

  8. ఈ షరతులలో, మన మొదటి స్థాయిని పాటించుట (అబ్రాహాము 3:26 చూడుము) మరియు తరువాత మర్త్యత్వములో యేసు క్రీస్తునందు, ఆయన ప్రాయశ్చిత్తఃమునందు విశ్వాసమును సాధన చేయుట, పశ్చాత్తాపపడుట, దేవుని యాజకత్వ అధికారము గల వారి చేత ముంచుట ద్వారా బాప్తీస్మము పొందుట, పరిశుద్ధాత్మ వరమును పొందుట, మరియు అంతము వరకు సహించుట (3 నీఫై 27:16–20 చూడుము) చేర్చబడినవి.

  9. అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ ఇలా బోధించారు: “ఈ సందేశమును వినుచున్న కొందరు బహుశా, ‘కాని నా సంగతేమిటి?’ అనవచ్చు. అనేకమంది యోగ్యతగల, అద్భుతమైన కడవరి-దిన పరిశుద్ధులు ప్రస్తుతము ఆదర్శమైన అవకాశములు మరియు వారి అభివృద్ధికి అవసరమైన అర్హతలు కొదువుగా ఉన్నారని మనకు తెలుసు. ఒంటరితనము, బిడ్డలు లేకపోవుట, మరణము, మరియు విడాకులు ఆదర్శములను నిరాశ పరచును మరియు వాగ్దానమివ్వబడిన దీవెనల నెరవేర్పును ఆలస్యము చేయును. … కానీ ఈ భంగపాటులు కేవలము తాత్కాలికమైనవి. ఆయన ఆజ్ఞలను పాటించు ఆయన కుమారులు మరియు కుమార్తెలకు, వారి నిబంధనలకు యదార్థముగా ఉండి, సరైన దానిని కోరు వారికి నిత్యత్వములలో ఏ దీవెనలు నిరాకరించబడవని ప్రభువు వాగ్దానమిచ్చెను” (“The Great Plan of Happiness,” Ensign, Nov. 1993, 75).

  10. మోషైయ 2:41 చూడుము.

  11. ఆల్మా 42:5 చూడుము; అది విమోచన ప్రణాళిక (ఉదాహరణకు, జేకబ్ 6:8 చూడుము) మరియు సంతోష ప్రణాళిక అని కూడా పిలువబడింది (ఆల్మా 42:8, 16 చూడుము).

  12. యోబు 38:4–7 చూడుము.

  13. ఉదాహరణకు, హెబ్రీయులకు 5:8;12:11; ఈథర్ 12:27 చూడుము. కనీసము మొదట్లో మర్త్యత్వములో మనము ఎదుర్కొనే సవాళ్లలో కొన్ని మన పరిమితమైన అవగాహన వలన మనము ఎక్కువగా నిరీక్షిస్తున్న వాగ్దానము చేయబడిన దీవెనలలో కొన్నిటిని పొందుట నుండి మనల్ని నిరోధిస్తున్నట్లుగా కనబడతాయి. ఈ కనిపించే వైరుధ్యాలను లక్ష్యపెట్టకుండా, మనము విశ్వాసముగా నిలిచియున్న యెడల, వాగ్దానమిచ్చిన ప్రతీ దీవెనను దేవుడు మనకిచ్చును.

  14. లూకా 1:31–35;యోహాను 1:14; 1 నీఫై 11:18–21 చూడుము; Guide to the Scriptures, “Jesus Christ,” scriptures.lds.org.

  15. సిద్ధాంతము మరియు నిబంధనలు 93:4–5, 16–17, 19–20 చూడుము.

  16. మోషే 7:32 చూడుము.

  17. సిద్ధాంతము మరియు నిబంధనలు122:9 చూడుము.

  18. రోమా 8:28 చూడుము.

  19. మత్తయి 6:11 చూడుము.

  20. See N. Eldon Tanner, “The Importance of Prayer,” Ensign, May 1974, 50–53.

  21. లూకా 11:10–13; యాకోబు 1:17 చూడుము.

  22. లూకా 11:5–10 చూడుము; జోసెఫ్ స్మిత్ అనువాదము, లూకా 11:5–6 (లూకా 11:5, వివరణ ); 3 నీఫై 13:6 చూడుము.

  23. మత్తయి 6:13 చూడుము.

  24. మోషే 7:31–40 చూడుము.

  25. యాకోబు 1:17 చూడుము.

  26. యోహాను 15:1–2; సిద్ధాంతము మరియు నిబంధనలు 122:6–7 చూడుము.

  27. హెబ్రీయులకు 12:5–11; సిద్ధాంతము మరియు నిబంధనలు 95:1 చూడుము.

  28. మోషే 7:35.

  29. ఆల్మా 37:12, 37 చూడుము

  30. యోహాను 14:26; 2 నీఫై 31:12 చూడుము

  31. యోహాను17:21–23, 26; సిద్ధాంతము మరియు నిబంధనలు 93:36 చూడుము

  32. సిద్ధాంతము మరియు నిబంధనలు 76:53; 88:67–68 చూడుము.

  33. 1 పేతురు 4:6 చూడుము. ఆయన బాప్తీస్మమిచ్చిన వ్యక్తి ఎందుకు సంఘములో చేరాడో మాట్లాడూతూ, ఎల్డర్ మెల్విన్ జె. బల్లార్డ్, ఇలా చెప్పారు, “కొన్ని సంవత్సరాల క్రితం అతడి పూర్వీకులు ఆత్మ లోకములో సువార్తను అంగీకరించారని నాకు తెలియచేయబడింది మరియు భూమిమీద వారి కుటుంబములో ఒకరు వారికొరకు ద్వారమును తెరుస్తారని ప్రార్థిస్తున్నారు, మరియు వారి ప్రార్ధనలు జవాబివ్వబడినవి మరియు ప్రభువు మిషనరీలను ఈ వ్యక్తి తలుపు వద్దకు నడిపించాడు” (in Melvin R. Ballard, Melvin J. Ballard, Crusader for Righteousness [1966], 250).

  34. మోర్మన్ 7:5–6 చూడుము; యోహాను 5:21, 26; 1 కొరింథీయులకు 6:14; 2 నీఫై 9:11–12; ఆల్మా 40:2–3; 3 నీఫై 27:14 కూడా చూడుము.

  35. యోహాను 5:22; జేకబ్ 6:9 ; ఆల్మా 11:44; హీలమన్ 14:15–18 చూడుము. క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃము శారీరక, ఆత్మీయ మరణములను కలిపి, ఆదాము పతనము యొక్క ప్రభావములన్నిటిని జయించును, మన పరలోకపు తండ్రి యొక్క సన్నిధికి తిరిగి వెళ్ళుటను మనకు సాధ్యపరచుటకు ఆ రెండును జయించబడాలి. వారి పాపములకు పశ్చాత్తాపపడిన వారు నిత్యత్వమందు తండ్రి మరియు కుమారునితో నివసిస్తారు. అయినప్పటికీ, పశ్చాత్తాపపడుటకు విఫలమయ్యే వారు రెండవ మరణమును భరించాలి, అది వారి స్వంత పాపముల చేత తేబడింది (హీలమన్ 14:15–18 చూడుము).

  36. 2 నీఫై 2:8.

  37. సిద్ధాంతము మరియు నిబంధనలు 76:56; 88:28–29 చూడుము.

  38. మోషైయ 2:41.

  39. ప్రకటన 7:17 చూడుము

  40. మోషే 7:30 చూడుము. టెర్రెస్ట్రియల్ రాజ్యములోని వారికి యేసు క్రీస్తు మరియు మిగిలిన సిలెస్టియల్ ప్రాణుల యొక్క పరిచర్యల ద్వారా (సిద్ధాంతము మరియు నిబంధనలు 76:77, 87 చూడుము) మరియు టిలేస్టియల్ రాజ్యములోని వారికి పరిశుద్ధాత్మ మరియు దేవదూతల పరిచర్యల ద్వారా కావలి కాయుట మరియు సమకూర్చుటను పరలోకపు తండ్రి కొనసాగించును (సిద్ధాంతము మరియు నిబంధనలు 76: 86, 88 చూడుము).

  41. మోషే 7:35; కీర్తన 90:2 చూడుము.

  42. కీర్తన 103:6–8; లూకా 6:36; మోషే 7:30 చూడుము.

  43. 1 యోహాను 4:16 చూడుము

  44. సిద్ధాంతము మరియు నిబంధనలు 84:40 చూడుము.

  45. యాకోబు 1:17 చూడుము

  46. సంఖ్యాకాండము 23:19 చూడుము

  47. అపోస్తులుల కార్యములు 10:34–35 చూడుము

  48. 1 నీఫై 9:6; సిద్ధాంతము మరియు నిబంధనలు 130:7 చూడుము.

  49. Dictionary.com జ్ఞానమును “నేర్చుకొను, వివేకముగల, గ్రహించగల సామర్ధ్యము మరియు అదేవిధమైన మానసిక క్రియల రూపములు సత్యములను, అనుబంధములను, వాస్తవములను, అర్ధములను” గ్రహించుటలో సహజ సామర్ధ్యము.” మరియు “జ్ఞానము.”

  50. అబ్రహాము 3:19 చూడుము. యేసు క్రీస్తు మహిమపరచబడిన, పరిపూర్ణుడైన ప్రాణి, మనందరికంటే మహా జ్ఞాని కూడా.

  51. ప్రకటన 21:22 చూడుము.

  52. అబ్రహాము 3:17 చూడుము.

  53. మోషే 1:39 చూడుము.

  54. Richard G. Scott, “Trust in the Lord,” Ensign, Nov. 1995, 17.

  55. Richard G. Scott, “Trust in the Lord,” 17.

  56. యోహాను 5:22; మోషే1:39 చూడుము. సాతాను మరియు మనకై మనము మనల్ని నిందించుకుంటాము (see ప్రకటన 12:10; ఆల్మా 12:14 చూడుము).

  57. See యోహాను 4:23; సిద్ధాంతము మరియు నిబంధనలు18:40; 20:29 చూడుము.

  58. 3 నీఫై 11:11; సిద్ధాంతము మరియు నిబంధనలు 93:11–19 చూడుము.

  59. పశ్చాత్తాపమనేది మనము దేవుని వలే కావడానికి మన సహజ స్వభావాలను మార్చుకొనే ప్రక్రియ. కాబట్టి, మనము “ఏదైనా తప్పు చేసినప్పుడు” మాత్రమే పశ్చాత్తాపపడకుండా, నిరంతరము పశ్చాత్తాపపడాలి.

  60. సిద్ధాంతము మరియు నిబంధనలు 93:19–20 చూడుము.

  61. విశ్వాసముపై ప్రసంగాలు, 38; మొరోనై 7:48; 10:32–33; సిద్ధాంతము మరియు నిబంధనలు 76:56, 94–95; 84:33–38 కూడా చూడుము.

  62. సిద్ధాంతము మరియు నిబంధనలు 93:20; వివరణ చేర్చబడింది.

  63. చూడుము మొరోనై10:32–33; సిద్ధాంతము మరియు నిబంధనలు 76:69, 94–95 చూడుము.

  64. ఆయన వలే మారే ప్రక్రియ గురించి దేవుడు ఇంకా ఎక్కువగా ఎందుకు బయల్పరచలేదు లేక బయల్పరచడు? కారణములన్నీ నాకు నిజముగా తెలియదు. కానీ కనీసము నేను గ్రహించినవి రెండున్నాయి. మొదటిది, కొన్ని విషయాలు మన మర్త్య స్థితిలో గ్రహింపశక్యము కానివి (సిద్ధాంతము మరియు నిబంధనలు 78:17 చూడుము). మధ్య యుగములలో జీవించిన వారికి ఇంటర్నెట్ గురించి వివరించుటకు ప్రయత్నించుటతో దానిని పోల్చవచ్చు. భావము మరియు దృష్టికోణము రెండు కేవలము అక్కడ లేవు. మరియు రెండవది, తరచుగా మనకు ఖచ్చితంగా వచ్చే కృప యొక్క వరములు, ఎందుకనగా అవి మనకు తెలియకపోవడం వలన వేదనపడి, ప్రయాసపడాలి.

  65. చేయమని మనము అడుగబడిన త్యాగములు పరిపూర్ణతను సాధించుటకు ముఖ్యమైనవి కావచ్చు (జోసెఫ్ స్మిత్ అనువాదము, హెబ్రీయులకు 11:40 [in హెబ్రీయులకు 11:40 లో, వివరణ ] చూడుము).

  66. రోమా 8:18 చూడుము

  67. సిద్ధాంతము మరియు నిబంధనలు 78:17–18.