ఏప్రిల్ 2017 ప్రధాన స్త్రీల సమావేశము ప్రధాన స్త్రీల సమావేశము బోన్ని హెచ్. కార్డన్ప్రభువునందు నమ్మకముంచుము మరియు నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనవద్దులేఖనాలు చదవమని, ప్రార్ధించమని, మరియు ఇతరులకు సేవ చేయమని, మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యేసు క్రీస్తునందు మన నమ్మకముంచమని సహోదరి కార్డన్ మనకు సలహా ఇస్తున్నారు. కారోల్ ఎఫ్. మెఖాంకీపరిశుద్ధాలంకారమునిబంధనలు పాటించుట, ఆత్మను వెంబడించుట, మరియు యేసు క్రీస్తుపై ఆధారపడుట ద్వారా, పరిశుద్ధత యొక్క వారి దైవిక వారసత్వమునకు తగినట్లుగా జీవించుటకు సహోదరి మెఖాంకీ సహోదరీలను ప్రోత్సహిస్తున్నారు. లిండా కె. బర్టన్నిబ్బరముగల స్త్రీలుక్రొత్త నిబంధనలోను, పునస్థాపన యొక్క ప్రారంభ దినాలలో, మరియు మన కాలములో స్థిరమైన మరియు దృఢమైన విశ్వాసముగల విశ్వాసులైన స్త్రీలను సహోదరి బర్టన్ వివరించారు. హెన్రీ బి. ఐరింగ్“నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను”పరిశుద్ధాత్మ మనకు శాంతిని తెస్తుందని, గత ఆత్మీయ అనుభవాలను గుర్తుంచుకోవటానికి మనకు సహాయపడుతుందని, మేలు చేయుటకు మనల్ని నడిపిస్తుందని, మరియు ఐక్యత, ప్రేమను ప్రేరేపించునని అధ్యక్షులు ఐరింగ్ బోధిస్తున్నారు. శనివారము ఉదయకాల సమావేశము శనివారము ఉదయకాల సమావేశము హెన్రీ బి. ఐరింగ్దేవుని యొక్క కుటుంబమును సమకూర్చుటకుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యము ద్వారా దేవుని యొక్క కుటుంబమును సమకూర్చుట యొక్క ప్రాముఖ్యత గురించి అధ్యక్షులు ఐరింగ్ బోధిస్తున్నారు. ఎమ్. జోసెఫ్ బ్రౌగ్ఆయన అనుదిన మార్గదర్శక హస్తముపరలోక తండ్రి మన అవసరాలను ఎరుగును మరియు ఆయన వద్దకు తిరిగి వెళ్ళుటకు సహాయపడుటకు ఒక ఆత్మీయ సంరక్షణా పార్సిలును మనలో ప్రతిఒక్కరికి ఇచ్చారని సహోదరుడు బ్రౌగ్ బోధించారు. ఎల్డర్ వీథర్ఫోర్డ్ టి. క్లేటన్మన తండ్రి యొక్క మహిమకరమైన ప్రణాళికరక్షణ ప్రణాళికలో యేసు క్రీస్తు యొక్క పాత్ర మరియు ఆయన ప్రాయశ్చిత్తము కలిపి, పరలోక తండ్రి యొక్క ప్రణాళికను గూర్చి ఎల్డర్ క్లేటన్ సాక్ష్యమిస్తున్నారు. డేల్ జి. రెన్లండ్మన మంచి కాపరిమన బలహీనతలను లక్ష్యపెట్టకుండా కనికరముగల మంచి కాపరియైన యేసు క్రీస్తు, తన గొఱ్ఱెలు స్వస్థపడుటను చూచుటలో సంతోషమును కనుగొనునని ఎల్డర్ రెన్లండ్ వివరిస్తున్నారు. యులెసెస్ సోర్స్సందేహించకుండా దేవునియందు విశ్వసించుముమన విశ్వాసమునందు మనము స్థిరముగా ఉండి మరియు సందేహించకూడదని ఎల్డర్ సోర్స్ బోధిస్తున్నారు. మార్క్ ఎ. బ్రాగ్పరిపూర్ణమైన దినము వరకు కాంతివంతముగా ప్రకాశించునుమనము ఎల్లప్పుడు వెలుగును కనుగొనగల మూడు విషయాలను గూర్చి ఎల్డర్ బ్రాగ్ మనకు బోధిస్తున్నారు: సంఘము యొక్క వెలుగు, సువార్త యొక్క వెలుగు, మరియు క్రీస్తు యొక్క వెలుగు. రస్సెల్ ఎమ్. నెల్సన్మన జీవితాలలోనికి యేసు క్రీస్తు యొక్క శక్తిని పొ౦దుటమనము ఆయన గురించి నేర్చుకొని, ఆయనయందు విశ్వాసము కలిగియుండి, ఆయనను చేరుకొని, మరియు మన నిబంధనలను పాటించినప్పుడు, మన జీవితాలలోనికి యేసు క్రీస్తు యొక్క శక్తిని మనము ఆకర్షించగలమని అధ్యక్షులు నెల్సన్ బోధిస్తున్నారు. శనివారము మధ్యాహ్నాకాల సమావేశము శనివారము మధ్యాహ్నాకాల సమావేశము డీటర్ ఎఫ్. ఉఖ్డార్ఫ్సంఘ అధికారులను ఆమోదించుటప్రధాన అధికారులు మరియు ప్రధాన కార్యదర్శులను ఆమోదించు ఓటు కొరకు అధ్యక్షులు ఉఖ్డార్ఫ్ సమర్పిస్తున్నారు. కెవిన్ ఆర్. జెర్గిన్సన్స౦ఘ౦ యొక్క ఆడిటింగ్ విభాగ నివేదిక, 20162016 కొరకు సంఘ ఆడిటింగ్ విభాగ నివేదికను సహోదరుడు జెర్గిన్సన్ సమర్పిస్తున్నారు. బ్రూక్ పి. హేల్స్గణాంకాల నివేదిక, 20162016 సంవత్సరము కొరకు సంఘము యొక్క గణాంక నివేదికను సహోదరుడు హేల్స్ ఇస్తున్నారు. రాబర్ట్ డి. హేల్స్మన ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క శిష్యునిగా మారుటయేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులగుటకు అవసరమైన అంతర్గతంగా అల్లుకొనబడిన అన్ని లక్షణాలను గూర్చి ఎల్డర్ హేల్స్ బోధిస్తున్నారు. జెఫ్రీ ఆర్. హాలండ్పాడినవి మరియు పాడని పాటలు“ఈరోజు నా ఆత్మలో ఉన్న సూర్యకాంతి,” కీర్తన నుండి, భావనను ఉపయోగిస్తూ, “సంతోష గీతమును” పాడలేమని భావించు వారికి ఎల్డర్ హాలండ్ ప్రోత్సాహిస్తున్నారు. గారీ బి. సాబిన్దృఢసంకల్పము కలిగియుండుము మరియు పూర్తిగా కట్టుబడియుండుముయేసు క్రీస్తు యొక్క ప్రమాణములను ఆమోదించుటలో సాహసముగా ఉండుటకు మనము ప్రయాసపడినప్పుడు, “పూర్తిగా కట్టుబడియుండుము” అని ఎల్డర్ సాబిన్ మనకు సలహా ఇస్తున్నారు. నీల్ ఎల్. ఆండర్సన్లోకమును జయించుటలోకమును జయించుట అనగా అర్ధమేమిటో ఎల్డర్ ఆండర్సన్ బోధిస్తున్నారు. అది పశ్చాత్తాపపడుట, రక్షకుని వెంబడించుట, మన నిబంధనలు పాటించుట, మరియు మనల్ని సహజముగా మార్చుకొనుటను కలిపియున్నది. ఎమ్. రస్సెల్ బాల్లర్డ్తిరిగి రండి మరియు పొందుముమన పరలోక తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్ళుటకు మరియు మన కొరకు వారు దాచియుంచిన దీవెనలు పొందుటకు మన శాయాశక్తులా చేయమని ఎల్డర్ బల్లార్డ్ మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఆదివారము ఉదయకాల సమావేశము ఆదివారము ఉదయకాల సమావేశము థామస్ ఎస్. మాన్సన్మోర్మన్ గ్రంథము యొక్క శక్తిప్రతీరోజు మోర్మన్ యొక్క గ్రంథమును చదవమని అధ్యక్షులు మాన్సన్ మనల్ని ప్రోత్సహిస్తున్నారు, ఆవిధంగా మనము యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యము బలమైన సాక్ష్యము ద్వారా పాపము మరియు కీడు నుండి మనము కాపాడబడగలము. జోయ్ డి. జోన్స్పాప-నిరోధక తరముపిల్లలు ధైర్యముగా, పాప-నిరోధకంగా ఉండుటకు మనము సహాయపడగలమని సహోదరి జోన్స్ పంచుకున్నారు. యూన్ వాన్ చోయ్చుట్టూ చూడకండి, పైకి చూడండి!క్రీస్తునొద్దకు వచ్చుటకు ఇతరులను మనము ఆహ్వానించాలని, మరియు యేసు క్రీస్తు వైపు చూచుట ద్వారా ఈ ఉద్దేశమును మనము నెరవేర్చగలమని ఎల్డర్ చోయ్ బోధిస్తున్నారు. ఎల్డర్ రాస్బాండ్ చేపరిశుద్ధాత్మను నడిపించనిమ్ముపరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించును, సాక్ష్యమిచ్చును, బోధించును, మరియు ప్రేరేపించునని ఎల్డర్ రాస్బాండ్ బోధిస్తున్నారు. ఎల్. విట్నీ క్లేటాన్ చేతఆయన మీతో చెప్పునది చేయుడిస్వల్ప విధానాలలో కూడా, మనము దేవుని ఆజ్ఞలకు విధేయులమైనప్పుడు, ఆయన మనల్ని విశ్వాసము మరియు బలముతో దీవించును. డాల్లిన్ హెచ్. ఓక్స్త్రియేక దేవుడు మరియు రక్షణ ప్రణాళికత్రియేక దేవుని మరియు రక్షణ ప్రణాళిక గురించి మనము సత్యమును కలిగియున్నాము కనుక, మన మర్త్య ప్రయాణము కొరకు మనము అంతిమ రోడ్ మ్యాప్ కలిగియున్నామని ఎల్డర్ ఓక్స్ బోధిస్తున్నారు. డీటర్ ఎఫ్. ఉక్డార్ఫ్పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టునుయేసు క్రీస్తు యొక్క స్వచ్ఛమైన మరియు పరిపూర్ణమైన ప్రేమయందు మనము నమ్మకముంచినప్పుడు, భయము కంటె మేలుగా విశ్వాసము ద్వారా మనము జీవిస్తామని అధ్యక్షుడు డీటర్ ఎఫ్. ఉక్డార్ఫ్ బోధిస్తున్నారు. ఆదివారము మధ్యాహ్నాకాల సమావేశము ఆదివారము మధ్యాహ్నాకాల సమావేశము డి. టాడ్ క్రిస్టాఫర్సన్హెచ్చరించు స్వరముసంతోషము యొక్క గొప్ప ప్రణాళిక దీవెనలు ఇతరులు కూడా నేర్చుకొనగలుగునట్లు సువార్తను పంచుకొనుట ద్వారా మనము వారిని హెచ్చరిస్తామని ఎల్డర్ క్రిస్టాఫర్సన్ అడుగుచున్నారు. వాక్వీన్ ఈ. కస్టాసంఘము యొక్క స్నేహితులు మరియు పరిశోధకులకుసంఘము యొక్క స్నేహితులు మరియు పరిశోధకుల కొరకు నాలుగు సూత్రములను ఎల్డర్ కస్టా పంచుకుంటున్నారు. ఎస్. మార్క్ పామర్యేసు అతని చూచి అతని ప్రేమించెనుక్రీస్తును అనుసరించుటకు ఇతరులను ప్రభావవంతంగా ఆహ్వానించుటకు బదులుగా మనము మొదట వారిని ప్రేమించాలని ఎల్డర్ పామర్ బోధిస్తున్నారు. గారీ ఈ. స్టీవెన్ సన్పరిశుద్ధాత్మ మీకే విధంగా సహాయపడగలదు?త్రియేక దేవుని యొక్క సభ్యుడు మరియు ఆత్మ స్వరూపియైన---పరిశుద్ధాత్మ---హెచ్చరించి, ఓదార్చి, మరియు సాక్ష్యమిచ్చునని ఎల్డర్ స్టీవెన్ సన్ బోధిస్తున్నారు. సి. స్కాట్ గ్రోమరియు ఇది నిత్యజీవముప్రార్ధన, లేఖన అధ్యయనము, మరియు ఆయన చిత్తమునకు విధేయత ద్వారా మనము దేవునిని తెలుసుకొనగలమని ఎల్డర్ గ్రో బోధిస్తున్నారు. క్వింటిన్ ఎల్. కుక్విశ్వాసము యొక్క పునాదులుమనము త్యాగము చేయాలని, యేసు క్రీస్తునందు మన విశ్వాసమును బలపరచుటకు కావలసిన వినయమును కలిగియుండాలని ఎల్డర్ కుక్ బోధిస్తున్నారు.