యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2025 అక్టోబరు
ప్రభువు ఒక సంఘాన్ని ఎందుకు కలిగియున్నారు?
క్రీస్తు సంఘము యొక్క ఉద్దేశము, “దేవుని యొక్క రక్షణ మరియు ఉన్నతస్థితి కార్యమును నెరవేర్చుటలో సహాయపడటానికి వ్యక్తులు మరియు కుటుంబాలకు వీలు కల్పించుట.” యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము, “దేవుని పిల్లలను మహిమ యొక్క మహోన్నతమైన క్రమము కొరకు అర్హులుగా చేయడానికి సహాయపడుతుంది, అది ఉన్నత స్థితి లేక నిత్యజీవము.”
రక్షకుడు తన ఉద్దేశాలను నెరవేర్చడానికి [సంఘాన్ని] నియమించారు అవి—ఆయన సువార్తను ప్రకటించడం, ఆయన విధులను మరియు నిబంధనలను అందించడం, మరియు ఆయన శక్తి మనల్ని సమర్థించి మరియు పవిత్రపరచడాన్ని సాధ్యమయ్యేలా చేయడం.
సంఘ సభ్యులు యాజకత్వ అధికారము మరియు తాళపు చెవులు, నిబంధనలు, విధులు, ప్రవచనాత్మక నడిపింపు, లేఖనాలు, మరియు పరిశుద్ధుల సమాజము ద్వారా యేసు క్రీస్తు యొక్క శక్తి మరియు దీవెనలకు ప్రవేశాన్ని కలిగియున్నారు.
సంఘము ఇలా కూడా ఆజ్ఞాపించబడింది: “మీ వెలుగు జనములకు ఒక ప్రమాణముగా నుండునట్లు లేచి, ప్రకాశించుడి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 115:5).
సంఘ సభ్యులు సువార్తను జీవిస్తూ, అందరినీ సువార్తను స్వీకరించడానికి ఆహ్వానిస్తూ, నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేస్తూ, మరియు పేదవారు, అవసరతలో ఉన్న వారి కోసం శ్రద్ధ తీసుకోవడం ద్వారా “ప్రకాశించడానికి” ప్రయాసపడతారు. ఇది దేవుని రక్షణ మరియు ఉన్నతస్థితి కార్యము.
© 2025 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, October 2025 యొక్క అనువాదము. Telugu. 19624 421