2025
ఎవరు దేవుడు కాదు
యౌవనుల బలము కొరకు, 2025 ఆగష్టు


యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2025 ఆగష్టు

ఎవరు దేవుడు కాదు

మన పరలోకపు తండ్రి గురించి 5 సత్యములు

ఎవరు ఆయన కాదో మనం గ్రహించినప్పుడు దేవుడు ఎవరో మనం ఎక్కువగా నేర్చుకోగలము.

చిత్రము మరియు పెయింట్ బ్రష్

కెమిలా గ్రే చేత వివరణ

పునఃస్థాపన యొక్క అతి పెద్ద దీవెనలలో ఒకటి, దేవుడు తనను తాను మరియు ప్రేమగల పరలోక తండ్రిగా తన స్వభావాన్నిమరలా బయల్పరిచారు. కానీ కొన్నిసార్లు దేవుని గురించి మనకు గల ఆలోచనలు లేదా అభిప్రాయాలు కేవలము నిజం కాదు. ఇది జరిగినప్పుడు, ఎవరు దేవుడు కాదో మనం గ్రహించినప్పుడు ఆయన ఎవరో మనం ఎక్కువగా నేర్చుకోగలము.

దేవుడు చాలా దూరంలో సింహాసనంపై కూర్చోన్న అపరిచిత వ్యక్తి కాదు.

ఆయన మన తండ్రి, మీరు ఊహించగల అత్యుత్తమైన భూలోక తండ్రి కంటే అద్భుతమైన వాడు. మర్త్యత్వమునకు ముందు ఆయనతో మన జీవితం మనకు గుర్తు లేనప్పటికినీ, ఆయన మనల్ని వ్యక్తిగతంగా మరియు పరిపూర్ణంగా ఎరుగును. ఆయన ఒక పరిపూర్ణమైన శరీరము, ఎముకలను కలిగియున్నారు,మరియు మనము ఆయన స్వరూపములో ఉన్నాము.

దేవుడు ఎలా ఉంటారని ఊహించడానికి మీరు ప్రయాసపడితే, అక్కడ ఒక పరిపూర్ణమైన మాదిరి ఉన్నది: ఆయన కుమారుడైన యేసు క్రీస్తు. “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగియుంటే, నా తండ్రిని ఎరిగియుందురు” అని క్రీస్తు చెప్పారు.(యోహాను14:6–7). మరొక మాటలలో, పరలోక తండ్రి ఎలా ఉంటారో తెలుసుకోవాలని మీరు కోరిన యెడల, యేసు క్రీస్తు ఎలా ఉంటారో మనం నేర్చుకోగలము! వారు ఉద్దేశములో పరిపూర్ణంగా ఏకమైయున్నారు.

దేవుడు మీ కోసం చాలా తీరికలేని వ్యక్తికాదు.

వాస్తవానికి, మీరు నిత్య జీవము కలిగియుండటానికి సహాయం చేయడం ఆయన కార్యము మరియు మహిమయైయున్నది. మీరు ఆయన #1 అత్యంత ప్రాధాన్యత! ఆయన మనలాగా సమయానికి కట్టుబడి ఉండరు. ఏ సమయంలోనైనా ప్రార్థనలో ఆయనను చేరుకొనండి. తరువాత ఆయన జవాబిచ్చే అనేక విధానాల కొరకు వినండి.

దేవుడు ఆయనను అనుసరించమని మిమ్మల్ని బలవంతం చేసే వ్యక్తి కాదు.

పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ ఒకసారి ఇలా బోధించారు, “పిల్లల పెంపకములో మన పరలోక తండ్రి లక్ష్యం ఏమిటంటే ఆయన పిల్లలు సరైనది చేసేలా చేయడం కాదు; ఆయన పిల్లలు సరైన దానిని ఎన్నుకొనేలా చేసి, చివరకు ఆయన వలే మారడం.” ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తారు, మీతో సంప్రదిస్తారు, మరియు మీకు సత్యమును బోధిస్తారు, కానీ ఆయనను అనుసరించడానికి మిమ్మల్ని బలవంతం చేయడం ద్వారా మీ కర్తృత్వాన్ని తీసివేయరు.

దేవుడు మిమ్మల్ని శిక్షించడానికి మీరు తప్పు చేస్తున్నప్పుడు మిమ్మల్ని పట్టుకోవాలని ప్రయత్నించే వ్యక్తి కాదు.

దానికి బదులుగా, పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క ఎల్డర్ పాట్రిక్ కీరన్ చెప్పినట్లుగా, “దేవుడు మిమ్మల్ని నిరంతరం వెదుకుతున్నారు,” అనగా అర్థము మీరు ఆయన వద్దకు తిరిగి వెళ్ళడానికి సహాయం చేసే ప్రయత్నాన్ని ఆయన ఎప్పటికీ వదులుకోరు. మనం తప్పులు చేసినప్పుడు సహజంగా మనందరం ఎదుర్కొనే కష్టమైన విషయాలను ఆయన ఎరుగును. కనుక ఆయన కుమారుని ప్రాయశ్చిత్తఃము ద్వారా, పాపము నుండి శుద్ధి చేయబడి మరియు బలము కనుగొనడానికి ఆయన మనకు ఒక మార్గమును సిద్ధపరిచారు.

ఆయన మిమ్మల్ని ప్రేమించడానికి ముందు, మీరు “తగినవారైయున్నారు” లేదా “పరిపూర్ణులుగా” ఉండాలని వేచియుండే వ్యక్తి దేవుడు కాదు.

మీ పట్ల ఆయన ప్రేమ ఆనంతమైనది. మీరు ఎంతో అసంపూర్ణులుగా ఉన్నప్పుడు కూడా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు! పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క తాత్కాలిక అధ్యక్షులైన అధ్యక్షులు జెఫ్రీ ఆర్. హాలండ్ ఈ సత్యము గురించి శక్తివంతమైన స్పష్టీకరణను ఇచ్చారు: “‘మీరు మీలాగే రండి’ అని ప్రేమగల తండ్రి మనలో ప్రతీఒక్కరికి చెబుతారు, కానీ ఆయన ఇలా అంటారు, ‘మీరున్నట్లుగా ఉండిపోవడానికి ప్రణాళిక చేయకండి.’ మనం చిరునవ్వు నవ్వుతాము మరియు అనుకున్నదానికంటే ఎక్కువగా దేవుడు మనల్ని తయారు చేయడానికి నిర్ణయించుకున్నాడని గుర్తుంచుకుంటాము.” పరిపూర్ణమైన ప్రేమ మరియు ప్రోత్సాహముతో, పరలోక తండ్రి మీరు ఒక్కొక్క అడుగు ఆయన వలె కావడానికి మరియు ఆయనకు గల సమస్తమును పొందడానికి సహయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

దేవుడు ఎవరు

మీ పరలోక తండ్రిని తెలుసుకోవడానికి ఉత్తమమైన మార్గం, ఆయనతో అనుభవాలను కలిగియుండుటమే. ఎలా? లేఖనాల నుండి మరియు జీవిస్తున్న ప్రవక్తల మాటల నుండి ఆయన గురించి మరియు ఆయన కుమారుని గురించి నేర్చుకొనండి. ఆయనకు ప్రార్థన చేయండి. ఆయన ఆజ్ఞలను పాటించండి. సంఘములో, దేవాలయములో మరియు మిగిలిన పరిశుద్ధ ప్రదేశాలలో ఆయనను ఆరాధిస్తూ నిశ్శబ్ధమైన సమయాన్ని గడపండి. ఆయనతో నిబంధనలు చేసి, పాటించండి. ఆయన ఎవరో మరియు మీ గురించి ఆయన ఎలా భావిస్తున్నారో తెలుసుకోవడానికి ఆయన మీకు సహాయపడతాడు.