యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2025 మార్చి
“ఈ లోకసంబంధమైన విషయములను ప్రక్కన పెట్టి” మనం లోకంలో ఎలా జీవిస్తాము?
The Disciples Whom He Had Chosen [ఆయన ఎన్నుకొనిన శిష్యులు], కేసి చైల్డ్స్ చేత
“నీవు ఈ లోకసంబంధమైన విషయములను ప్రక్కన పెట్టి, ఉత్తమమైన సంగతులను వెదకవలెనని” ప్రభువు చెప్పెను (సిద్ధాంతము మరియు నిబంధనలు 25:10). దీనర్థము మనం మన తాత్కాలిక మరియు భౌతిక అవసరాలను విస్మరించాలని కాదు, కానీ మనం సంపద, అధికారం, స్థానం లేదా ప్రపంచ అంగీకారంపై మన హృదయాలను ఉంచుకోమని అర్థం. ప్రపంచంలో జీవించడం గురించి మనకు బోధించబడిన సూత్రాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి:
దేవుని యొక్క విషయములకు మొదటి స్థానం ఇవ్వండి. “ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి” (మత్తయి 6:33). మన హృదయాలలో మరియు మన జీవితాలలో, దేవుని ఆజ్ఞలు మరియు ఆయనతో మన నిబంధనలు మన ప్రాధాన్యత.
నేర్చుకోవడాన్ని వెదకండి. “మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకునేటప్పుడు, రక్షకుని గురించి కూడా తెలుసుకోండి. … మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, దేవుని రాజ్యాన్ని నిర్మించడంలో మరియు ప్రపంచాన్ని మంచి కోసం ప్రభావితం చేయడంలో మీరు అంత ఎక్కువగా సహాయపడగలరు” (For the Strength of Youth: A Guide for Making Choices [2022], 31, 32).
పని. “పని అనేది ఒక ముఖ్యమైన సువార్త సూత్రం. అది మనల్ని ప్రోత్సహిస్తుంది మరియు అభివృద్ధి చేస్తుంది. … మనం మన కుటుంబాలను పోషించాలని మాత్రమే కాకుండా, ‘ఆతృతతో ఒక మంచి కార్యములో నిమగ్నమై’ ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు [సిద్ధాంతము మరియు నిబంధనలు 58:27]” (“Employment,” Topics and Questions, Gospel Library).
© 2025 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, March 2025 యొక్క అనువాదము Telugu. 19628 421