2025
లిబర్టీ చెరసాల
2025 మే


“లిబర్టీ చెరసాల,” ఫ్రెండ్, 2025 ఆగష్టు, 26–28.

ఫ్రెండ్ నెలవారీ సందేశం, 2025 ఆగష్టు

లిబర్టీ చెరసాల

ఇళ్ళను తగలబెడుతున్న మరియు తుపాకులతో కోపంగా ఉన్న మనుషులు

మిస్సోరిలోని అనేకమంది జనులు పరిశుద్ధులను ఇష్టపడలేదు. గవర్నర్ సైనికులను పంపి వారిని వెళ్ళగొట్టాడు.

గుర్రంపై ఉన్న వ్యక్తి జోసెఫ్ స్మిత్ వైపు కత్తి చూపిస్తున్నాడు.

ప్రవక్త జోసెఫ్ స్మిత్ మరియు ఇతర సంఘ నాయకులను సైనికులు బంధించారు. ఒకరాత్రి, కావలివారు పరిశుద్ధులపట్ల వారు చేసిన చెడు విషయాలను బట్టి నవ్వుతున్నారు.

జోసెఫ్ స్మిత్ తన మణికట్టు మీద గొలుసులతో కట్టబడియుండి, లేచి నిలబడి వ్యక్తులతో మాట్లాడుతున్నాడు.

జోసెఫ్ లేచి నిలబడి, “నిశ్శబ్దం!” అని అరిచారు. అతడు దేవుని శక్తితో మాట్లాడాడు. వారు క్షమించండి అని చెప్పి, కావలివారు మాట్లాడడం మానేశారు.

జోసెఫ్ స్మిత్ మరియు ఇతర వ్యక్తులు లిబర్టీ చెరసాలలో విషాదంగా మరియు చల్లగా కనిపిస్తున్నారు.

తరువాత, జోసెఫ్ మరియు అతని స్నేహితులు లిబర్టీ అనే పట్టణంలోని చెరసాలలో ఉంచబడ్డారు. చెరసాల చాలా చల్లగా, చిన్నగా మరియు చీకటిగా ఉంది. పడుకోవడానికి వారి దగ్గర కొంత మురికి గడ్డి మాత్రమే ఉంది. వారికి ఇవ్వబడిన ఆహారము వారిని అనారోగ్యానికి గురి చేసింది.

జోసెఫ్ స్మిత్ ఏడుస్తున్నాడు మరియు ఒక వ్యక్తి అతడిని ఓదారుస్తున్నాడు

జోసెఫ్ పరిశుద్ధుల గురించి ఆందోళన చెందాడు. కానీ వారికి సహాయపడేందుకు అతడు ఏమీ చేయలేకపోయాడు.

జోసెఫ్ స్మిత్ చెరసాలలో మోకరించి ప్రార్థించాడు.

జోసెఫ్ చాలా ప్రార్థించాడు. దేవుడు తన గురించి మరియు సంఘ సభ్యుల గురించి మరచిపోయారా అని అతడు అడిగాడు.

జోసెఫ్ స్మిత్ చెరసాలలో మోకరించి, ఒక చిన్న కిటికీలో ప్రసరిస్తున్న సూర్యకాంతి వైపు చూస్తున్నాడు

దేవుడు జోసెఫ్ ప్రార్థనకు జవాబిచ్చారు. “నా కుమారుడా, నీ ఆత్మకు శాంతి కలుగును గాక” అని ఆయన అన్నారు. అతని సవాళ్లు శాశ్వతంగా ఉండవని, అవి అతని మంచి కోసమే ఉంటాయని దేవుడు జోసెఫ్‌తో చెప్పారు. అతనితో “నిత్యము మరియు నిరంతరము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:7, 46) ఉంటానని ఆయన వాగ్దానం చేశారు.

రంగులువేసే పేజీ

నేను ఇతరులకు వెలుగుగా ఉండగలను.

లైట్‌హౌస్, రాతి తీరం మరియు సముద్రంలో పడవతో రంగులు వేసే పేజీ కార్యక్రమము

కోరీ ఎగ్‌బర్ట్ చేత వివరణ

మీరు ఇతరులకు ఒక మంచి మాదిరిగా ఎలా ఉన్నారు?