“లిబర్టీ చెరసాల,” ఫ్రెండ్, 2025 ఆగష్టు, 26–28.
ఫ్రెండ్ నెలవారీ సందేశం, 2025 ఆగష్టు
లిబర్టీ చెరసాల
మిస్సోరిలోని అనేకమంది జనులు పరిశుద్ధులను ఇష్టపడలేదు. గవర్నర్ సైనికులను పంపి వారిని వెళ్ళగొట్టాడు.
ప్రవక్త జోసెఫ్ స్మిత్ మరియు ఇతర సంఘ నాయకులను సైనికులు బంధించారు. ఒకరాత్రి, కావలివారు పరిశుద్ధులపట్ల వారు చేసిన చెడు విషయాలను బట్టి నవ్వుతున్నారు.
జోసెఫ్ లేచి నిలబడి, “నిశ్శబ్దం!” అని అరిచారు. అతడు దేవుని శక్తితో మాట్లాడాడు. వారు క్షమించండి అని చెప్పి, కావలివారు మాట్లాడడం మానేశారు.
తరువాత, జోసెఫ్ మరియు అతని స్నేహితులు లిబర్టీ అనే పట్టణంలోని చెరసాలలో ఉంచబడ్డారు. చెరసాల చాలా చల్లగా, చిన్నగా మరియు చీకటిగా ఉంది. పడుకోవడానికి వారి దగ్గర కొంత మురికి గడ్డి మాత్రమే ఉంది. వారికి ఇవ్వబడిన ఆహారము వారిని అనారోగ్యానికి గురి చేసింది.
జోసెఫ్ పరిశుద్ధుల గురించి ఆందోళన చెందాడు. కానీ వారికి సహాయపడేందుకు అతడు ఏమీ చేయలేకపోయాడు.
జోసెఫ్ చాలా ప్రార్థించాడు. దేవుడు తన గురించి మరియు సంఘ సభ్యుల గురించి మరచిపోయారా అని అతడు అడిగాడు.
దేవుడు జోసెఫ్ ప్రార్థనకు జవాబిచ్చారు. “నా కుమారుడా, నీ ఆత్మకు శాంతి కలుగును గాక” అని ఆయన అన్నారు. అతని సవాళ్లు శాశ్వతంగా ఉండవని, అవి అతని మంచి కోసమే ఉంటాయని దేవుడు జోసెఫ్తో చెప్పారు. అతనితో “నిత్యము మరియు నిరంతరము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:7, 46) ఉంటానని ఆయన వాగ్దానం చేశారు.
రంగులువేసే పేజీ
నేను ఇతరులకు వెలుగుగా ఉండగలను.
కోరీ ఎగ్బర్ట్ చేత వివరణ
మీరు ఇతరులకు ఒక మంచి మాదిరిగా ఎలా ఉన్నారు?
© 2025 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, August 2025 యొక్క అనువాదము. Telugu. 19642 421