“మొదటి దర్శనము,” ఫ్రెండ్, 2025 జనవరి, 26–28.
ఫ్రెండ్ నెలవారీ సందేశము, 2025 జనవరి
మొదటి దర్శనము
మీరు ఈ కథను జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:1-20 లో చదువవచ్చు.
జోసెఫ్ స్మిత్ బాల్యంలో, అనేక సంఘములు యేసు క్రీస్తు గురించి వివిధ సంగతులు బోధించాయి. ఏ సంఘములో చేరాలో జోసెఫ్‌కు తెలియలేదు.
ఒక రోజు అతడు బైబిలులో యాకోబు 1:5 చదివాడు. మనకు జ్ఞానము అవసరమైతే, మనం దేవుడిని అడగవచ్చు అని అందులో చెప్పబడింది. జోసెఫ్ అలా చేయడానికి నిర్ణయించుకున్నాడు.
అందమైన వసంతకాలంలో ఒక రోజు, పరలోక తండ్రికి ప్రార్థన చేయడానికి జోసెఫ్ అడవిలోకి వెళ్ళాడు.
జోసెఫ్ మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాడు. కానీ అప్పుడు అతని చుట్టూ చీకటి కమ్ముకున్నట్లు అనిపించింది. జోసెఫ్ భయపడ్డాడు. అతడు దేవుడ్ని సహాయం అడిగాడు.
అకస్మాత్తుగా, ఒక ప్రకాశవంతమైన వెలుగు ఆకాశము నుండి క్రిందికి రావడాన్ని జోసెఫ్ చూసాడు. పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు గాలిలో నిలబడియుండడం అతడు చూసాడు. పరలోక తండ్రి జోసెఫ్ పేరు పిలిచారు. తర్వాత ఆయన యేసు క్రీస్తును చూపించి , “ ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినుము!” అన్నారు.
అతడు ఆ సంఘములలో దేనిలోను చేరకూడదని యేసు జోసెఫ్‌తో చెప్పారు.
సంపూర్ణ సువార్తను భూమిపై పునఃస్థాపించడానికి జోసెఫ్ సహాయం చేస్తాడు.
మరెన్నడూ జోసెఫ్ సందేహపడలేదు. అతడు సంతోషముతో నింపబడ్డాడు! దేవుడు తనను ప్రేమిస్తున్నాడని అతడు తెలుసుకున్నాడు. అతడు పరలోక తండ్రిని, యేసు క్రీస్తును చూసాడని కొంతమంది నమ్మలేదు, కానీ అది నిజమని అతనికి తెలుసు.
రంగులువేసే పేజీ
పరలోక తండ్రి నా ప్రార్థనలను ఆలకిస్తారు మరియు జవాబిస్తారు
కోరీ ఎగ్బర్ట్ చేత వివరణ
జోసెఫ్ స్మిత్ యొక్క ప్రార్థనకు పరలోక తండ్రి జవాబిచ్చారు. ఆయన మీ ప్రార్థనలకు కూడా జవాబిస్తారు!
© 2025 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, January 2025 యొక్క అనువాదము. Telugu. 19632 421