“జోసెఫ్ స్మిత్ మరియు బంగారు పలకలు,” ఫ్రెండ్, జనవరి 2021, 42–44
లేఖన కథలు
జోసెఫ్ స్మిత్ మరియు బంగారు పలకలు
ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు
జోసెఫ్ స్మిత్ ఒక ప్రవక్త. యేసు తన సంఘాన్ని తిరిగి లోకంలోకి తేవడానికి అతడు సహాయపడ్డాడు.
ఏ సంఘానికి వెళ్ళాలో తెలుసుకోవడానికి జోసెఫ్ ప్రార్థించాడు. ఏ సంఘానికి వెళ్ళవద్దని యేసు చెప్పాడు. వాటిలో ఏదీ ఆయన సంఘము కాదు.
మొరోనై దూత జోసెఫ్‌ను దర్శించాడు. బంగారు పలకలపై వ్రాయబడిన ఒక ప్రత్యేక గ్రంథము గురించి మొరోనై అతడికి చెప్పాడు. దగ్గరలోని ఒక కొండలో అది సమాధి చేయబడింది.
పరలోక తండ్రి సహాయంతో జోసెఫ్ బంగారు పలకలపైనున్న వ్రాతను అనువదించాడు. ఈ రచనలు మోర్మన్ గ్రంథమయ్యాయి!
ఇప్పుడు మనం మోర్మన్ గ్రంథాన్ని చదవగలం. యేసు క్రీస్తు యొక్క సంఘానికి మనం వెళ్ళగలం!