మిషను పిలుపులు
కాబోయే సువార్తికుల కోసం మౌఖిక ప్రశ్నలు


బయట ఆకుపచ్చ భవనం వెనుక చెక్క అరుగుమీద కూర్చున్న కంబోడియా జంటకు బోధిస్తున్న పెద్దవారైన ఇద్దరు సువార్తికులు.

కాబోయే సువార్తికుల కోసం మౌఖిక ప్రశ్నలు

బిషప్పులు మరియు స్టేకు అధ్యక్షులు క్రింది ప్రశ్నలను ఉపయోగించి ప్రతి సువార్తికునితో “క్షుణ్ణంగా, ఆధ్యాత్మికంగా శోధించే మరియు ఉద్ధరించే మౌఖికాలు” నిర్వహించాలని ఆహ్వానించబడ్డారు (ప్రధాన చేతిపుస్తకము, 24.4.2 చూడండి).

  1. నిత్యుడగు తండ్రియైన దేవునియందు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు మరియు పరిశుద్ధాత్మయందు మీరు విశ్వాసమును మరియు సాక్ష్యమును కలిగియున్నారా?

  2. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును గూర్చి మరియు రక్షకునిగా, విమోచకునిగా ఆయన పాత్రను గూర్చి మీరు సాక్ష్యమును కలిగియున్నారా?

    దయచేసి మీ సాక్ష్యాన్ని నాతో పంచుకోండి. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది?

  3. యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపనను గూర్చి మరియు మోర్మన్ గ్రంథము యొక్క యథార్థతను గూర్చి మీరు సాక్ష్యమును కలిగియున్నారా?

    యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త గురించి మీ అవగాహన మరియు మోర్మన్ గ్రంథము యొక్క మీ అధ్యయనం యేసు క్రీస్తుతో మీ సంబంధాన్ని ఎలా వృద్ధిచేసాయి?

  4. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క అధ్యక్షుడిని ప్రవక్తగా, దీర్ఘదర్శిగా మరియు బయల్పాటుదారునిగా, సమస్త యాజకత్వ తాళపుచెవులను ఉపయోగించుటకు అధికారము పొందిన ఏకైక వ్యక్తిగా మీరు ఆమోదిస్తున్నారా?

    ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క సభ్యులను ప్రవక్తలుగా, దీర్ఘదర్శులుగా మరియు బయల్పాటుదారులుగా మీరు ఆమోదిస్తున్నారా?

    సంఘము యొక్క ఇతర ప్రధాన అధికారులు మరియు స్థానిక నాయకులను మీరు ఆమోదిస్తున్నారా?

  5. ఆయన యెదుట అన్ని సంగతులు “స్వచ్ఛతతో చేయబడవలెను“ అని ప్రభువు చెప్పారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:41).

    దేవుని ముందు స్వచ్ఛత కోసం ప్రయత్నించడంలో అశ్లీలతను నివారించడం ఎందుకు ఉంటుంది?

    మీ అవగాహన ప్రకారం, పవిత్రత యొక్క చట్టాన్ని పాటించడం అంటే ఏమిటి?

    మీ ఆలోచనలలో, ప్రవర్తనలో నైతిక స్వచ్ఛత కొరకు మీరు కృషి చేస్తున్నారా?

    పవిత్రత యొక్క చట్టానికి మీరు విధేయులైయున్నారా?

  6. మీ కుటుంబ సభ్యులతో మరియు ఇతరులతో మీ వ్యక్తిగత మరియు బహిరంగ ప్రవర్తనలో మీరు యేసు క్రీస్తు సంఘము యొక్క బోధనలను అనుసరిస్తున్నారా?

  7. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘపు బోధనలు, ఆచరణలు లేదా సిద్ధాంతములకు వ్యతిరేకముగా ఉన్న వేటికైనా మీరు మద్దతిస్తున్నారా లేదా ప్రోత్సహిస్తున్నారా?

  8. గృహములో మరియు సంఘములో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి; మీ కూడికలకు హాజరవ్వడానికి; సంస్కారము కొరకు సిద్ధపడి యోగ్యతతో దానిలో పాలుపొందడానికి; మరియు సువార్త యొక్క చట్టాలకు, ఆజ్ఞలకు అనుగుణంగా మీ జీవితాన్ని గడపడానికి మీరు కృషి చేస్తున్నారా?

  9. మీరు చేసే వాటన్నిటిలో నిజాయితీగా ఉండడానికి మీరు కృషి చేస్తున్నారా?

  10. మీరు పూర్తి దశమభాగమును చెల్లించువారిగా ఉన్నారా?

  11. మీ అవగాహన ప్రకారం, జ్ఞానవాక్యాన్ని జీవించడం అంటే ఏమిటి?

    జ్ఞానవాక్యానికి మీరు విధేయులైయున్నారా?

  12. పూర్తి-కాల సువార్తికునిగా మీరు మనం చర్చించిన ఈ ప్రమాణాలకు అనుగుణంగా జీవిస్తారా?

  13. (వరము పొందని సభ్యుడిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈ ప్రశ్న విస్మరించబడుతుంది.) మీరు దేవాలయంలో చేసిన నిబంధనలను పాటిస్తున్నారా?

  14. (వరము పొందని సభ్యుడిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈ ప్రశ్న విస్మరించబడుతుంది.) ఆరంభ విధులలో సూచించిన విధంగా వస్త్రాన్ని ధరించే మీ పవిత్ర విశేషాధికారాన్ని మీరు గౌరవిస్తున్నారా? (క్రింద చేర్చబడిన “దేవాలయ వస్త్రమును ధరించుట“ అనే ప్రకటనను ప్రతి సభ్యునికి చదివి వినిపించండి.)

  15. యాజకత్వ అధికారుల వద్ద తీవ్రమైన పాపాలను ఒప్పుకోవడంతో సహా, పశ్చాత్తాపపడడం అంటే మీకు గల అర్థం ఏమిటి?

    మీ పశ్చాత్తాపములో భాగముగా యాజకత్వ అధికారులతో పరిష్కరించబడవలసియున్న తీవ్రమైన పాపములు మీ జీవితంలో ఏవైనా ఉన్నాయా?

  16. ఒక సువార్తికునిగా యేసు క్రీస్తుకు మరియు పునఃస్థాపించబడిన ఆయన సంఘానికి ప్రాతినిధ్యం వహించడానికి మీరు యోగ్యులని భావిస్తున్నారా?

దేవాలయ వస్త్రమును ధరించుట

“పరిశుద్ధ యాజకత్వము యొక్క వస్త్రము దేవాలయంలోని తెరను మనకు జ్ఞాపకం చేస్తుంది మరియు ఆ తెర యేసు క్రీస్తుకు చిహ్నముగా ఉన్నది. మీరు వస్త్రమును ధరించినప్పుడు, మీరు యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ చిహ్నమును ధరిస్తున్నారు. దానిని ధరించుట ఆయనను అనుసరించడానికి మీ అంతర్గత నిబద్ధత యొక్క బహిర్గత వ్యక్తీకరణ. వస్త్రము మీ దేవాలయ నిబంధనల యొక్క జ్ఞాపికగా కూడా ఉంది. మీరు మీ జీవిత కాలమంతా వస్త్రమును పగలు, రాత్రి ధరించాలి. వస్త్రాన్ని ధరించి సహేతుకంగా చేయలేని కార్యకలాపాల కోసం దానిని తీసివేయాల్సి వచ్చినప్పుడు, వీలైనంత త్వరగా దానిని ధరించడానికి ప్రయత్నించండి. ఆరంభ విధులలో సూచించబడినట్లుగా వస్త్రమును ధరించే పవిత్ర విశేషాధికారముతో పాటు మీరు మీ నిబంధనలను పాటించినప్పుడు, రక్షకుని యొక్క కనికరము, భద్రత, బలము మరియు శక్తికి మీరు అధిక ప్రాప్యతను కలిగియుంటారు” (ప్రధాన చేతిపుస్తకము, 26.3.3.2).

న్యూయార్క్‌లో తిరుగుతున్న సువార్తికురాళ్ళు
జనులతో మాట్లాడుతున్న సువార్తికుల జంట