యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2026 ఫిబ్రవరి
సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? కృతజ్ఞతను ప్రయత్నించండి
మీ జీవితం మార్పులతో నిండినప్పుడు, మీరు సానుకూలంగా మరియు ఆశాజనకంగా ఉండటానికి కృతజ్ఞత మీకు సహాయపడుతుంది.
మాగీ స్టీఫెన్సన్ చేత వివరణలు
“మీరు కృతజ్ఞతతో ఉన్నంత సంతోషంగా మారెప్పుడూ ఉండరు.”
డెబ్బది యొక్క ఎల్డర్ గారీ బి. సాబిన్ నుండి ఈ వ్యాఖ్యానము వలే, మీరు ఎంత సంతోషంగా ఉన్నారనేది మీరు ఎంత కృతజ్ఞతతో ఉన్నారనే దానిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇది అర్ధవంతంగా ఉంటుంది—మీరు కృతజ్ఞత కలిగియున్నప్పుడు, మీరు ప్రతికూల విషయాలపై కాకుండా సానుకూల విషయాలపై దృష్టి సారిస్తారు.
అయినా, జీవితం ఎల్లప్పుడు ప్రణాళిక ప్రకారం జరగదు. ఊహించని మార్పులు మిమ్మల్ని సంతోషంగా కంటే ఒత్తిడి, విచారము, లేదా నిరాశపరచవచ్చు. కానీ విషయాలు కష్టమైనప్పుడు, కృతజ్ఞత ఆశాజనకంగా ఉండటానికి మీకు సహాయపడవచ్చు. మీ జీవితంలోకి కృతజ్ఞతను ఎక్కువగా తేవడానికి ఈ మూడు విధానాలను ప్రయత్నించండి.
1. మంచి కొరకు వెదకండి
తరచుగా, మీకు ఏదో కొదువుగా ఉన్నట్లు అనిపించినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండటం కష్టం. కానీ మీకు కలిగియున్న దానికంటే లేని దానిపై దృష్టిసారించుట ద్వారా మీరు ఏ దీవెనలను నిర్లక్ష్యం చేస్తున్నారు?
మీ జీవితంలో మంచి కొరకు వెదకినప్పుడు, కాలక్రమేణా అది కనుగొనడం సులభమవుతుంది.
2. ఇచ్చిన వానికి కృతజ్ఞతను తెలియజేయండి
మీ దీవెనలను మీరు లెక్కించినప్పుడు, అవి ఎక్కడ నుండి వచ్చాయో మరచిపోవద్దు.
పరలోక తండ్రి—ఆయన కుమారుని వరము కలిపి—ఆయన బహుమానముల కొరకు కృతజ్ఞతను తెలుపుట ఆయన కొరకు మీ ప్రేమను మరియు విశ్వాసమును లోతుగా చేయగలదు. ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారులు, అధ్యక్షులు డి. టాడ్ క్రిస్టాఫర్సన్ కూడ వివరించారు, “దేవునికి కృతజ్ఞతను వ్యక్తపరచుట మరియు అనుభూతి చెందడం … ఆరాధనలో ఆనందకరమైన పునరుద్ధరణ భావనను నింపుతుంది,” మీకు ఆనందాన్ని మరియు బలాన్ని తెస్తుంది, మరియు మీ సాక్ష్యం సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది.
3. పరలోక తండ్రి యొక్క ప్రణాళికపై దృష్టిసారించండి
స్పష్టంగా, కృతజ్ఞత కలిగియుండుట అనగా జీవితంలో కష్టమైన విషయాలను విస్మరించడం లేదా ఎల్లప్పుడు సంతోషంగా ఉండటం కాదు. యేసు క్రీస్తు కూడా నొప్పిని భరించారు మరియు అంగీకరించారు (ఆల్మా 7:11; సిద్ధాంతములు మరియు నిబంధనలు 19:18–19 చూడండి). విచారము మర్త్యత్వములో సహజమైన భాగము.
ఏది ఏమైనప్పటికినీ, ఒక విషయం ఎప్పటికీ మార్పు చెందదు: మన పరలోక తండ్రి యొక్క కనికరము యొక్క ప్రణాళిక. జీవితంలో మీరు అనుభవించే విచారము మరియు గాయము యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తము వలన సరిచేయబడుతుంది (ప్రకటన 21:4 చూడండి).
పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ వివరించారు: “నిరాశగల సమయాలలో కృతజ్ఞత కలిగియుండుట అనగా మన పరిస్థితులతో మనం సంతోషంగా ఉన్నామని అర్ధము కాదు. విశ్వాసపు నేత్రముల ద్వారా మన ప్రస్తుత-దిన సవాళ్ళను మించి చూడగలమని దాని అర్ధము.”
© 2026 by Intellectual Reserve, Inc. All rights reserved. అమెరికాలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, February 2026 యొక్క అనువాదము. Telugu. 19935 421