2025
మొదటి క్రిస్మస్ సమయం‌లో గొఱ్ఱెల కాపరుల గురించి మనకు ఏమి తెలుసు?
యౌవనుల బలము కొరకు, 2025 డిసెంబరు


యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2025 డిసెంబరు

మొదటి క్రిస్మస్ సమయం‌లో గొఱ్ఱెల కాపరుల గురించి మనకు ఏమి తెలుసు?

యువతి

గొఱ్ఱెల కాపరులు, బ్రైయన్ కాల్ చేత

మొదటి క్రిస్మస్ సమయం‌లో గొఱ్ఱెల కాపరుల గురించి మనకు కొన్ని విషయాలు తెలుసు.

వారు బెత్లెహేము సమీపములో ఉన్నారు. క్రీస్తు జన్మించిన “అదే దేశంలో” గొఱ్ఱెల కాపరులు ఉన్నారు(లూకా 2:8). మరియు ఆయన అక్కడ ఉండగానే వారు కాలినడకన బేత్లెహేము చేరుకోగలిగారు (లూకా 2:15-16 చూడండి).

వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ “గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండిరి.” (లూకా 2:8). వారు రక్షకుని వలె మంచి మరియు నమ్మకమైన కాపరులు—మంచి కాపరి (యోహాను 10:11, 14 చూడండి).

వారికి మెస్సీయ గురించి ప్రవచనాలు తెలుసు. పురాతన కాలంలో ప్రవచించబడిన మెస్సీయ అయిన, “ప్రభువైన క్రీస్తు” (లూకా 2:11) జననాన్ని దేవదూత ప్రకటించినప్పుడు, అతను ఏమి మాట్లాడుతున్నాడో వారికి స్పష్టంగా తెలుసు.

వారు గొప్ప ఆసక్తి కలిగియున్నారు. దేవదూత “తొట్టిలో పండుకొనియున్న శిశువును” గురించి వారికి చెప్పినప్పుడు (లూకా 2:12), వారు ఆయనను చూడటానికి “త్వరగా” వెళ్లారు (లూకా 2:16).

వారు శుభవార్తను పంచుకున్నారు. క్రీస్తు జననం గురించి దేవదూత సందేశానికి సంబంధించి వారు విన్న మరియు చూసిన దానిని “ప్రచురము చేసిరి” (లూకా 2:17).

వారు దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ఆయనను స్తుతించారు. ఇదంతా జరిగిన తర్వాత, వారు “తిరిగి వచ్చి, తాము విన్నవాటిని మరియు కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమ పరచిరి” (లూకా 2:20).