“పస్కాపండుగ,” ఫ్రెండ్,2026 ఏప్రిల్, 46–48.
నెలవారీ ఫ్రెండ్ సందేశము, ఏప్రిల్ 2026
పస్కాపండుగ
మోషే ఫరో దగ్గరికి వెళ్లి ఇశ్రాయేలు బానిసలను విడిపించమని అడిగాడు. ఫరో నిరాకరించాడు. ప్రభువు ఐగుప్తుపై తెగుళ్లను పంపాడు, ఫరో అయినాకూడా వద్దనే అన్నాడు.
ప్రభువు ఒక చివరి తెగులును పంపుతానని చెప్పారు. ఐగుప్తులోని ప్రతి కుటుంబంలోని మొదటి సంతానం మరణిస్తారు. కానీ ఇశ్రాయేలీయులు ఆయన సూచనలను పాటించినట్లైతే, తెగులు వారిని దాటుకొని వెళుతుంది.
పరిపూర్ణమైన మగ గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించాలని మరియు వారి ఇంటి గుమ్మాలపై గొఱ్ఱెపిల్ల రక్తాన్ని పూయాలని ప్రభువు ప్రతి ఇశ్రాయేలీయులుకు చెప్పారు.
తెగులు వచ్చింది. ఫరో యొక్క పెద్దకుమారునితో పాటు, ఐగుప్తులో ప్రతిఒక్కరి తొలి సంతతి మరణించారు. ప్రభువుకు విధేయత చూపించడం వలన, ఇశ్రాయేలీయుల యొక్క తొలి సంతతి రక్షించబడ్డారు.
ఫరో మోషేను మరియు ఇశ్రాయేలీయులను ఐగుప్తు విడిచి వెళ్ళమని చెప్పాడు. కానీ ఫరో కోపంగా ఉన్నాడు. అతను మరియు అతని సైన్యం వారిని వెంబడించారు.
ఇశ్రాయేలీయులు ఎఱ్ఱసముద్రము దగ్గర దండుదిగారు. ఐగుప్తీయులు రావడం చూచినప్పుడు ఇశ్రాయేలీయులు భయపడ్డారు. మోషే ప్రభువు వారిని కాపాడతారని చెప్పాడు.
మోషే తన కర్రను పైకెత్తాడు, మరియు ప్రభువు ఆ సముద్రాన్ని పాయలుగా విడగొట్టారు. ఆరిన నేలపై ఇశ్రాయేలీయులు ఆ సముద్రాన్ని దాటారు.
ఇశ్రాయేలీయులందరూ సముద్రము అవతలి వైపు సురక్షితంగా ఉన్నప్పుడు, నీరు దిగి వచ్చి సైన్యాన్ని ముంచివేసింది. చివరికి ఇశ్రాయేలీయులు స్వేచ్ఛను పొందారు.
రంగులువేసే పేజీ
యేసు క్రీస్తు నా కొరకు పునరుత్థానము చెందారు.
ఆడ్రీ డే ద్వారా దృష్టాంతాలు. సంఘ ఉపయోగం కోసం మాత్రమే కాపీ చేయవచ్చు.
ఈ ఈస్టర్ మరియు సంవత్సరం పొడవునా యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఏమి చేయగలరు?
© 2026 by Intellectual Reserve, Inc. All rights reserved. అ. సం. రాలలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, April 2026 యొక్క అనువాదం Telugu. 20062 421