ఫ్రెండ్
ప్రవక్తయైన మోషే
2025 మార్చి ఫ్రెండ్


“ప్రవక్తయైన మోషే,” ఫ్రెండ్, 2026 మార్చి, 46–48.

ఫ్రెండ్ నెలవారీ సందేశము, 2026 మార్చి

ప్రవక్తయైన మోషే

ఒక ఐగుప్తీయుడు, ఇశ్రాయేలీయుల బానిసను దుర్వినియోగం చేయడాన్ని చూస్తున్న, ఐగుప్తు వస్త్రధారణలో ఉన్న మోషే

మోషే ఇశ్రాయేలీయుడు, కానీ అతను ఐగుప్తులో ఫరో కుమార్తెచే పెంచబడ్డాడు. ఐగుప్తీయులు, ఇశ్రాయేలీయుల పట్ల కఠినంగా వ్యవహరించి, వారిని తమ బానిసలుగా చేసుకున్నందుకు మోషే బాధపడ్డాడు.

ఇశ్రాయేలు బానిస చుట్టూ చేయి వేసి, అతనికి మద్దతు ఇస్తున్న మోషే

ఒకరోజు ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడ్ని కొట్టడం మోషే చూసాడు. మోషే ఇశ్రాయేలీయుడిని రక్షించాడు.

అరణ్యంలో ఒంటరిగా ఉన్న మోషే

ఆ సంగతిని ఫరో కనుగొన్నప్పుడు, అతడు మోషేను చంపాలనుకున్నాడు, కానీ మోషే ఐగుప్తు నుండి పారిపోయాడు.

తన భార్య మరియు పిల్లలతో మోషే

మోషే మిద్యాను అని పిలవబడిన ప్రదేశానికి వచ్చాడు, అక్కడ అతడు సిప్పోరా అనే పేరుగల స్త్రీను కలుసుకున్నాడు. వారు పెండ్లి చేసుకున్నారు మరియు వారికి పిల్లలు కలిగారు.

మండుతున్న పొదలో ప్రభువును చూస్తున్న మోషే

మిద్యానులో నివసిస్తుండగా, మోషే మండుతున్న పొదను చూసాడు కానీ మంట పొదను కాల్చలేదు. ప్రభువు అగ్నిలో కనబడి, మోషేతో మాట్లాడారు.

మోషేతో మాట్లాడుతున్న ప్రభువు

ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బాధపడుతున్నారని ఆయనకు తెలుసని ప్రభువు చెప్పారు. ఐగుప్తుకు తిరిగి వెళ్ళి, ఇశ్రాయేలీయులను విడిచిపెట్టమని ఫరోతో చెప్పమని ఆయన మోషేకు ఆజ్ఞాపించారు. ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఆయన మోషేకు సహాయపడతానని, ఒక వాగ్దాన దేశమునకు వారిని నడిపిస్తానని ప్రభువు చెప్పారు.

రంగులు వేసే పేజీ

నేను ఇతరులపట్ల దయగా ఉండగలను

రంగులువేసే పేజీ పీడీఎఫ్

ఆడ్రీ డే చేత వివరణ. సంఘ ఉపయోగం కోసం మాత్రమే కాపీ చేయవచ్చు.

ఈ వారం దయతో ఉండటానికి మీరు ఏమి చేయగలరు?