ఫ్రెండ్
నోవహు మరియు ఓడ
2026 ఫిబ్రవరి ఫ్రెండ్


“నోవహు మరియు ఓడ,” ఫ్రెండ్, 2026 ఫిబ్రవరి, 46–48.

ఫ్రెండ్ నెలవారీ సందేశం, 2026 ఫిబ్రవరి

నోవహు మరియు ఓడ

నోవహు, అతడి కుటుంబము గొఱ్ఱెలను మేపుతున్న దృష్టాంతము

నోవహు, అతడి కుటుంబము ప్రభువుకు విధేయులుగా ఉన్నారు. మిగిలిన జనులందరు చాలా దుష్టులు. జనులు పశ్చాత్తాపపడకపోతే, జలప్రళయము భూమిని ముంచివేస్తుందని ప్రభువు నోవహుతో చెప్పారు.

నోవహు బోధిస్తున్నాడు

ప్రభువు వారిని ప్రేమిస్తున్నాడని, వారు పశ్చాత్తాపపడాలని, యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగియుండాలని జనులకు నోవహు చెప్పాడు. వారు వినలేదు.

నోవహు, అతడి కుటుంబము ఓడను నిర్మిస్తున్నారు.

ప్రభువు నోవహును ఓడ అని పిలువబడే పెద్ద పడవను నిర్మించమని చెప్పారు. నోవహు కుటుంబాన్ని వరద సమయంలో ఓడ క్షేమంగా ఉంచుతుంది.

ఓడలోనికి నడిచి వెళ్తున్న జంతువులు

నోవహు కుటుంబం ఓడలోనికి ఆహారము తెచ్చింది. నోవహు ఓడలో ఉంచడానికి అన్ని రకాల జంతువులలో కనీసం రెండిటిని ప్రభువు పంపించారు. తరువాత వర్షం కురవసాగింది.

సముద్రముపై తేలుతున్న ఓడ

40 రోజులు మరియు 40 రాత్రులు వర్షం కురిసింది. ప్రభువు హెచ్చిరించినట్లుగా, వరద భూమిని కప్పివేసింది.

నోవహు, అతడి కుటుంబము ఓడ లోపల ఉన్నారు.

నోవహు కుటుంబం మరియు ఓడలోని జంతువులన్నీ నీటిపై సురక్షితంగా తేలుతున్నాయి.

నోవహు కుటుంబం మరియు జంతువులన్నీ నేలపై నిలబడి, ఇంద్రధనస్సు వైపు చూస్తున్నారు.

వరద ముగిసినప్పుడు, పొడి నేలపైన ఓడ ఆగింది. నోవహు, అతడి కుటుంబము వారిని కాపాడినందుకు ప్రభువుకు కృతజ్ఞతను తెలిపారు. భూమిపై మరలా ఎన్నడూ వరద రాదని ప్రభువు వాగ్దానమిచ్చారు. తన వాగ్దానము యొక్క జ్ఞాపకార్థముగా ఆయన ఇంద్రధనస్సును పంపారు.

రంగులు వేసే పేజీ

ప్రభువు యొక్క ప్రవక్తను అనుసరించడం నన్ను దీవిస్తుంది

Page PDF

ఆడ్రీ డే చేత వివరణ

ప్రవక్తను అనుసరించడానికి మీరేమి చేయగలరు?