“ఆదాము మరియు హవ్వ,” ఫ్రెండ్, 2026 జనవరి, 46–48.
ఫ్రెండ్ నెలవారీ సందేశము, 2026 జనవరి
ఆదాము మరియు హవ్వలు
ఆదాము, హవ్వలు భూమి మీద జీవించిన పరలోక తండ్రి యొక్క పిల్లలలో మొదటివారు. ఏదేను వనములో వారు నివసించారు.
దేవుడు ఒక్క చెట్టు ఫలమును తప్ప ప్రతీ చెట్టు ఫలమును వారిని తిననిచ్చాడు. మంచి చెడుల జ్ఞానమిచ్చే వృక్ష ఫలమును వారు తింటే, వారు వనమును విడిచి వెళ్ళాలి మరియు చివరకు చనిపోతారు. కానీ సాతాను వారితో అబద్ధమాడింది. వారు ఫలము తింటే చనిపోరని, వారికి మంచి చెడులు తెలుస్తాయని అతడు చెప్పాడు.
పండును తినడానికి హవ్వ ఎంచుకొంది.
తరువాత ఆమె పండులో కొంత భాగమును ఆదాముకిచ్చింది. అతడు కూడా దానిని తినడానికి ఎంచుకున్నాడు.
దేవుడు మరియు యేసు క్రీస్తు వారిని సందర్శించారు, కాని ఆదాము హవ్వలు భయపడి, దాక్కున్నారు. మంచి చెడుల జ్ఞానమిచ్చే వృక్ష ఫలమును తిన్నారా అని దేవుడు వారిని అడిగారు.
ఆదాము, హవ్వలు ఫలమును తిన్నామని దేవునితో చెప్పారు. ఇప్పుడు వారు ఏదేను వనము విడిచి వెళ్ళాల్సి వచ్చింది. కానీ దేవుడు వారి కోసం ఒక ప్రణాళికను కలిగియున్నారు. ఇప్పుడు వారికి తప్పు ఒప్పులు తెలుసు మరియు పిల్లల్ని కనగలరు.
దేవుని ఆజ్ఞలకు విధేయులవుతామని ఆదాము, హవ్వలు వాగ్దానమిచ్చారు. వారు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు గురించి ఎక్కువగా తెలుసుకున్నారు. వారి కుటుంబము దేవుని వద్దకు తిరిగి వెళ్ళడానికి ఆయన సహాయడపడతాడు గనుక, వారు సంతోషంగా ఉన్నారు.
రంగులు వేసే పేజీ
యేసు భూమిని సృష్టించారు.
ఆడ్రీ డే చేత వివరణ
యేసు క్రీస్తు సృష్టించిన వాటిలో మీకు ఇష్టమైన వస్తువులు ఏమిటి?
© 2026 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, January 2026 యొక్క అనువాదము. Telugu. 19919 421