నెలవారీ ఫ్రెండ్ సందేశం, 2025 జూలై
గ్రేట్ బ్రిటన్‌లో అపొస్తలులు సువార్తసేవ చేస్తారు
అపొస్తలులలో కొందరిని గ్రేట్ బ్రిటన్‌లో మిషనుపై పంపమని ప్రభువు జోసెఫ్ స్మిత్‌కు చెప్పారు. తమ కుటుంబాలను విడిచి వెళ్ళడం అపొస్తలులకు కష్టమైనది, కానీ ప్రభువు వారిని దీవిస్తానని వాగ్దానము చేసారు.
హీబర్ సి. కింబల్ మరియు ఆయన భార్య, వైలేట్‌లకు చిన్న కుటుంబం ఉంది. వారిలో అనేకమంది చాలా అస్వస్థత చెందారు.
బ్రిగం యంగ్ కూడా అనారోగ్యంతో ఉన్నాడు, మరియు అతనిది పేద కుటుంబం. కానీ, “వెళ్ళి, నీ సువార్తసేవ చెయ్యి. ప్రభువు నిన్ను దీవిస్తారు,” అని బ్రిగం భార్య మేరీ ఆన్ అతనితో చెప్పింది.
హీబర్ మరియు బ్రిగం మెరుగైన స్థితిని పొందారు, కానీ వారు చాలా బలహీనంగా ఉన్నారు. వారు సువార్తను ప్రకటించాలని కోరారు, కనుక వారు తమ కుటుంబాలకు వీడ్కోలు చెప్పి, వారి ప్రయాణం ప్రారంభించడానికి ఒక బండి వెనుక ఎక్కారు.
సముద్రం మీదుగా సుదీర్ఘ ప్రయాణం తర్వాత, హీబర్ మరియు బ్రిగం గ్రేట్ బ్రిటన్‌కు చేరుకున్నారు. మిగిలిన అపొస్తలులతోపాటు, వారు అనేకమందికి సువార్తను బోధించారు. వేలమంది జనులు యేసు క్రీస్తు యొక్క సంఘములోనికి బాప్తీస్మము పొందారు. వారిలో అనేకమంది అమెరికా సంయుక్త రాష్టాలలోని పరిశుద్ధులతో చేరడానికి సముద్రాన్ని దాటి ప్రయాణించారు.
హీబర్ మరియు బ్రిగంలు ఆయన సువార్తికులుగా సేవ చేస్తున్నప్పుడు, వారి కుటుంబాలను జాగ్రత్తగా చూస్తానని ప్రభువు వారికిచ్చిన తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.
రంగులువేసే పేజీ
దేవుడు భూమిపై ఉన్న ప్రతి జీవిని సృష్టించారు.
కోరీ ఎగ్‌బర్ట్ చేత వివరణ
మీ ఇష్టమైన జీవి ఏది?
© 2025 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, July 2025 యొక్క అనువాదము. Telugu. 19639 421