జూన్ 2025, నెలవారీ ఫ్రెండ్ సందేశం
కర్ట్‌లాండ్ దేవాలయ నిర్మాణం
అమెరికాలోని ఓహైయో, కర్ట్‌లాండ్ దేవాలయమును నిర్మించడానికి ఇది సమయమని ప్రభువు జోసెఫ్‌కు చెప్పారు. అది ప్రభువు తన జనులను సందర్శించి వారితో వాగ్దానాలు చేసే ఒక ప్రత్యేక స్థలం.
పరిశుద్ధులు దేవాలయాన్ని నిర్మించడం ప్రారంభించారు. దానికి చాలా డబ్బు ఖర్చయింది మరియు చాలా పని చేయవలసి వచ్చింది. అయితే వారు ప్రభువు యొక్క దీవెనలను పొందడానికి ఉత్సాహంగా ఉన్నారు.
పరిశుద్ధులు దేవాలయం కొరకు పని చేస్తున్నప్పుడు, వారికి డబ్బు తక్కువైంది. వారు సహాయం కోసం దేవుడిని ప్రార్థించారు.
కారొలైన్ టిప్పెట్స్ అనే ఒక మహిళ మరియు ఆమె కుటుంబం చాలా డబ్బు పొదుపు చేశారు. దేవాలయ నిర్మాణంలో సహాయపడేందుకు సంఘానికి వారి డబ్బును అప్పుగా ఇచ్చారు.
పరిశుద్ధులు కష్టపడి పనిచేసారు. కొందరు రాళ్లతో నిండిన బండ్లను తరలించారు. మరికొందరు పనివారికి బట్టలు మరియు ఆహారం తయారు చేశారు.
పిల్లలు పగిలిన గాజు ముక్కలను సేకరించి, పొడిచేసి, దేవాలయ గోడలు సూర్యకాంతిలో మెరిసేలా దానిని గోడలపై అమర్చారు.
త్వరలోనే దేవాలయం పూర్తయింది! ప్రభువు వారికి వాగ్దానము చేసిన దీవెనలు పొందడానికి ఆయన మందిరానికి వెళ్ళేందుకు పరిశుద్ధులు ఉత్సాహముతో ఉన్నారు.
రంగులువేసే పేజీ
నేనెవరో ప్రభువుకు తెలుసు మరియు ఆయన నన్ను ప్రేమిస్తున్నారు.
కోరీ ఎగ్‌బర్ట్ చేత వివరణ
మీ ముఖాన్ని అండాకారములో గీయండి. యేసు క్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీకెలా తెలుసు?
© 2025 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, June 2025 యొక్క అనువాదము. Telugu. 19643 421