“లూసీ సత్యాన్ని కనుగొనింది,” ఫ్రెండ్, 2025 ఏప్రిల్, 26–28.
నెలవారీ ఫ్రెండ్ సందేశము, 2025 ఏప్రిల్
లూసీ సత్యాన్ని కనుగొనింది
ఒక రోజు, 15 సంవత్సరాల లూసీ మోర్లే తన పొరుగువారైన, అబిగైల్ డానియేల్స్‌కు, వస్త్రమును నేయడంలో సహాయపడుతున్నది. వారు పని చేస్తున్నప్పుడు, ముగ్గురు సువార్తికులు తలుపు తట్టారు. ఒక సందేశాన్ని పంచుకోవడానికి యేసు క్రీస్తు వారిని పంపారని వారు చెప్పారు.
జోసెఫ్ స్మిత్‌ను ఒక ప్రవక్తగా ఉండడానికి యేసు క్రీస్తు పిలిచారని ఆ వ్యక్తులు లూసీ మరియు అబిగైల్‌కు చెప్పారు. వారు మోర్మన్ గ్రంథము గురించి కూడా వారికి చెప్పారు.
లూసీకి ఆశ్చర్యం కలిగేలా, అబిగైల్‌కు కోపం వచ్చింది. ఆమె సువార్తికులను తన ఇంటిని విడిచి వెళ్ళేలా చేసింది.
ఈ సువార్తికులు దేవుని సేవకులని లూసీకి తెలుసు. మార్గములో ఉన్న తన కుటుంబాన్ని సందర్శించమని ఆమె వారితో చెప్పింది.
సువార్తికులు మోర్లే ఇంటికి వెళ్లారు. లూసీ తల్లిదండ్రులు తమకు మరియు వారి స్నేహితులకు బోధించడానికి సువార్తికులను ఆహ్వానించారు.
ఆ రాత్రి, 17 మంది జనులు బాప్తీస్మము పొందారు. తర్వాతి కొద్ది రోజుల్లో, మరో 50 మంది సువార్తికుల బోధనలు విని బాప్తిస్మము పొందారు. లూసీ యొక్క పొరుగువారైన అబిగైల్ కూడా తన మనస్సు మార్చుకున్నది. ఆమె మరియు ఆమె భర్త, లూసీ మరియు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బాప్తిస్మము తీసుకోవడం ద్వారా యేసు క్రీస్తును అనుసరించాలని నిర్ణయించుకున్నారు.
రంగులువేసే పేజీ
యేసు క్రీస్తు మూలముగా, నేను పునరుత్థానము చెందుతాను.
కోరీ ఎగ్‌బర్ట్ చేత వివరణ
ఈస్టర్ సమయంలో మీరు యేసును ఎలా గుర్తుచేసుకుంటారు?
© 2025 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, April 2025 యొక్క అనువాదము. Telugu. 19631 421