2025
యాజకత్వము పునఃస్థాపించబడినది
2025 మార్చి


“యాజకత్వము పునఃస్థాపించబడినది,” ఫ్రెండ్ 2025 మార్చి, 26–28.

ఫ్రెండ్ నెలవారీ సందేశము, 2025 మార్చి

యాజకత్వము పునఃస్థాపించబడినది

మీరు ఈ కథనాన్ని జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:66–73 మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 27:12లో చదవవచ్చు.

నీఫైయులను సందర్శిస్తున్న క్రీస్తు ఊహా చిత్రంతో పాటు ఆలీవర్ కౌడరీతో మాట్లాడుతున్న జోసెఫ్ స్మిత్ చిత్రం

జోసెఫ్ స్మిత్ బంగారు పలకలను స్వీకరించిన తరువాత, అతను వాటిని అనువదించడం ప్రారంభించాడు. ఆలీవర్ కౌడరీ అతను చెప్పినదానిని వ్రాసాడు. వారు పని చేస్తున్నప్పుడు, అందరూ బాప్తిస్మము తీసుకోవాలని యేసు క్రీస్తు కోరుకుంటున్నారని వారు తెలుసుకున్నారు.

జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలు అడవిలో ప్రార్థన చేస్తున్నారు

జనులకు బాప్తిస్మమిచ్చే దేవుని యొక్క అధికారము ఎవరికి ఉందో అని జోసెఫ్ మరియు ఆలీవర్‌లు ఆశ్చర్యపడ్డారు. దేవుడిని ప్రార్థించి, అడగడానికి వారు అడవిలోకి వెళ్లారు.

జోసెఫ్ స్మిత్ తలపై తన చేతులతో దేవదూత

వారు ప్రార్థించినప్పుడు, ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. తాను చాలాకాలం క్రితం యేసు క్రీస్తుకు బాప్తీస్మమిచ్చిన, బాప్తీస్మమిచ్చు యోహానును అని అతడు చెప్పాడు. అతను జోసెఫ్ మరియు ఆలీవర్‌లకు అహరోను యాజకత్వమును ఇచ్చారు, తద్వారా వారు ఇతరులకు బాప్తిస్మం ఇవ్వగలరు. యాజకత్వము అనేది దేవుని యొక్క శక్తి. అది దేవుని పిల్లలను దీవించడానికి ఉపయోగించబడుతుంది.

ఆలీవర్ కౌడరీకి బాప్తిస్మమిస్తున్న జోసెఫ్ స్మిత్

జోసెఫ్ మరియు ఆలీవర్‌లను బాప్తీస్మము పొందమని బాప్తీస్మమిచ్చు యోహాను చెప్పాడు. వారు నదిలోనికి వెళ్ళి ఒకరికొకరు బాప్తీస్మము ఇచ్చుకున్నారు. వారు నీటిలోనుండి బయటకు వచ్చినప్పుడు, వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు చాలా సంతోషించారు!

ముగ్గురు దేవదూతలు జోసెఫ్ స్మిత్ తలపై తమ చేతులు ఉంచారు

తరువాత, మిగిలిన దేవదూతలు వచ్చారు. యేసు క్రీస్తు యొక్క ముగ్గురు అపొస్తలులైన—పేతురు, యాకోబు, మరియు యోహానులు—జోసెఫ్ మరియు ఆలీవర్‌లకు మెల్కీసెదకు యాజకత్వమును ఇచ్చారు. ఇప్పుడు జోసెఫ్‌ మరియు ఆలీవర్‌లు ఇతరులకు పరిశుద్ధాత్మ వరమును ఇవ్వగలరు.

రంగులువేసే పేజీ

హృదయ కీర్తనను యేసు ప్రేమిస్తారు.

కీర్తనా స్వరములతో హృదయం

కోరీ ఎగ్‌బర్ట్ చేత వివరణ

మీరు యేసు క్రీస్తు గురించి పాడినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?