2025
జోసెఫ్ స్మిత్ బంగారు పలకలను పొందుకుంటాడు
2025 ఫిబ్రవరి


“జోసెఫ్ స్మిత్ బంగారు పలకలను పొందుకుంటాడు,” ఫ్రెండ్, 2025 ఫిబ్రవరి, 26-28.

“మోర్మన్ గ్రంథము సత్యమని నేను సాక్షిగా ఉండగలను,” ఫ్రెండ్, 2025 ఫిబ్రవరి, 48.

ఫ్రెండ్ నెలవారీ సందేశం, 2025 ఫిబ్రవరి

జోసెఫ్ స్మిత్ బంగారు పలకలను పొందుకుంటాడు

మీరు ఈ కథను జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:28–60 లో చదువవచ్చు.

జోసెఫ్ స్మిత్ కిటికీలో నుండి చూస్తున్నాడు

మొదటి దర్శనమైన మూడు సంవత్సరాల తర్వాత, జోసెఫ్ స్మిత్ తాను చేసిన కొన్ని తప్పుల గురించి బాధపడ్డాడు. ఆయన దాని గురించి పరలోక తండ్రికి ప్రార్థించారు.

ప్రార్థనలో మోకరించిన జోసెఫ్ స్మిత్

జోసెఫ్ ప్రార్థిస్తుండగా, గది వెలుగుతో నింపబడింది. ఒక దేవదూత గాలిలో నిలబడటం అతను చూసాడు. ఆ దేవదూత పేరు మొరోనై.

దేవదూత మొరోనై జోసెఫ్ స్మిత్‌ని అతని గదిలో సందర్శించుట

బంగారు పేజీలు లేదా పలకలతో చేయబడిన ఒక గ్రంథము ఉన్నదని మొరోనై చెప్పాడు. అది జోసెఫ్ ఇంటి దగ్గరలోని ఒక కొండలో సమాధి చేయబడింది. ఈ గ్రంథము అమెరికాలో చాలాకాలం క్రితం జీవించిన జనులను గూర్చినది. ఆ గ్రంథాన్ని అనువదించడానికి దేవుడు జోసెఫ్‌కు సహాయపడతారని మొరోనై చెప్పాడు.

జోసెఫ్ స్మిత్ బంగారు పలకలను చూడటానికి గొయ్యిలోకి తొంగిచూస్తున్నాడు

జోసెఫ్ స్మిత్ కొండమీదకు వెళ్ళాడు మరియు ఒక బరువైన రాయి క్రింద పలకలను కనుగొన్నాడు. మొరోనై వచ్చి, వాటిని తీసుకోవడానికి జోసెఫ్ ఇంకా సిద్ధంగా లేడని జోసెఫ్‌కు చెప్పాడు.

దేవదూత మొరోనై జోసెఫ్ స్మిత్‌‌తో మాట్లాడుట

జోసెఫ్ వయసులో పెద్దవాడైనప్పుడు, మొరోనై కొండపై అతడిని కలుసుకున్నాడు మరియు అతనికి పలకలను ఇచ్చాడు. వాటిని సురక్షితంగా ఉంచమని మొరోనై జోసెఫ్‌కు చెప్పాడు.

ఒక కుటుంబంతో మాట్లాడుతున్న జోసెఫ్ స్మిత్

జోసెఫ్ స్మిత్ పలకలను ఆంగ్లంలోకి అనువదించడం ప్రారంభించాడు. అతడికి సహాయపడటానికి దేవుని నుండి సిద్ధపరచిన ప్రత్యేక సాధనాలను అతడు ఉపయోగించాడు. ఈ గ్రంథము 1830లో మోర్మన్ గ్రంథముగా ప్రచురించబడింది. ఇది యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి బోధిస్తుంది.

రంగులువేసే పేజీ

మోర్మన్ గ్రంథము సత్యమని నేను సాక్షిగా ఉండగలను

మోర్మన్ గ్రంథమును కౌగిలించుకుంటున్న అమ్మాయి యొక్క రంగులువేసే పేజీ

కోరీ ఎగ్‌బర్ట్ చేత వివరణ

మోర్మన్ గ్రంథములో యేసు క్రీస్తు గురించి తెలుసుకోవడానికి మీరు ఇతరులకు ఎలా సహాయం చేయగలరు?