“రోలిన్స్ సహోదరీలు వీరోచితమైన దానిని చేసారు!” ఫ్రెండ్, జూన్ 2021
జూన్ 2021, నెలవారీ ఫ్రెండ్ సందేశం
రోల్లిన్స్ సహోదరీలు వీరోచితమైన దానిని చేసారు!
ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు
మనకు సహాయపడుటకు అనేక ముఖ్యమైన విషయాలను యేసు క్రీస్తు ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు చెప్పాడు. యేసు యొక్క మాటలను ప్రచురించడానికి సంఘము ఒక ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేసింది. ఆ విధంగా జనులు వాటిని చదవగలుగుతారు.
ఒకరోజు, కోపంగా ఉన్న వారి బృందం వచ్చింది. వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్‌ను నాశనం చేసారు. వారు లేఖనాల పేజీలను వీధిబయట విసిరేసారు.
మేరీ ఎలిజబెత్ మరియు కరోలిన్ రోలిన్స్ అనే పేర్లుగల ఇద్దరు సహోదరీలు జరిగిన దానిని చూసారు. వారు పరుగెత్తి, కాగితాలను ఏరి వారి చేతులలలోనికి తీసుకున్నారు.
వ్యక్తులు వెళ్ళిపోయేవరకు బాలికలు మొక్కజొన్న తోటలో దాక్కొన్నారు. వారు లేఖనాలను కాపాడారు! తరువాత ఆ లేఖనాలు సిద్ధాంతము మరియు నిబంధనల యొక్క భాగమైనవి.
నేను లేఖనాలను చదవగలను. నేను ధైర్యంగా ఉండి, నేను నమ్మిన దానికోసం నిలబడగలను.
రంగులువేసే పేజీ
నేను ధైర్యంగా ఉండగలను
ధైర్యంగా ఉండటానికి మీకేమి సహాయపడుతుంది?
© 2021 by Intellectual Reserve, Inc. All rights reserved. అమెరికాలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. జూన్ 2021, నెలవారీ ఫ్రెండ్ సందేశము యొక్క అనువాదము Telugu 17470 421.